అలెర్జిక్ రినైటిస్

రోగనిర్థారణ

మీ సమస్యను రోగనిర్థారణ చేయడానికి ప్రయత్నించేటప్పుడు, డాక్టరు మీ మరియు మీ కుటుంబం యొక్క వైద్య చరిత్ర, జీవన విధానం, తినే అలవాట్లు, పని మరియు గ్రుహ వాతావరణం మరియు మీరు ఎదుర్కొనే లక్షణాల తరచుదనం మరియు తీవ్రత గురించి డాక్టరు సవివరమైన ప్రశ్నలు అడుగుతారు. డాక్టరు మిమ్మల్ని పరీక్షిస్తారు మరియు మీ లక్షణాలను ఏది తీవ్రంగా లేదా మెరుగ్గా చేస్తుందనే దానిపై ఆధారపడి మీకు ఎలర్జిక్ రైనిటిస్ ఉన్నదా లేదా కొన్ని ఇతర సమస్యలు ఉన్నాయా అనే విషయం మీ డాక్టరుకు తెలుస్తుంది.

మీ లక్షణాలు తీవ్రంగా ఉంటే, మీకు దేనికి ఎలర్జీ ఉంది అనే విషయం కనుగొనేందుకు, ఎలర్జీ పరీక్ష చేయించుకోవలసిందిగా మీ డాక్టరు మిమ్మల్ని అడగవచ్చు. కొన్నిసార్లు, మీకు దేనికి ఎలర్జీ ఉందో కనుగొనేందుకు కూడా ప్రత్యేక రక్త పరీక్షలు సహాయపడవచ్చు.

Please Select Your Preferred Language