ఊపిరి

శ్వాసతీసుకోలేకపోవడం అంటే ఏమిటి?

10 మెట్లు ఎక్కిన తరువాత గానీ లేదా ప్రత్యేకించి రఫ్ పని చేసిన తరువాత గానీ, మనందరికీ ఏదో ఒక పాయింటులో శ్వాసతీసుకోలేకపోవడం అనుభవిస్తాం. మీకు శ్వాసతీసుకోవడం కష్టంగా అనిపించినప్పుడు ఇది మీకు కలిగే అసౌకర్యమైన అనుభూతి. మీరు ఎక్కువగా శ్రమిస్తే మీరు ఊపిరితీసుకోలేని అనుభూతి చెందడం పూర్తిగా సర్వసాధారణం. మీ శరీరానికి ఎక్కువ ఆక్సిజెన్ ఇచ్చేందుకు, సమయంలో మీరు వేగంగా శ్వాసతీసుకుంటారు. అయితే, పూర్తిగా మామూలు పనులు చేసేటప్పుడు మీకు ఊపిరాడనట్లుగా అనిపిస్తే, ఇది డాక్టరును సందర్శించవలసిన సమయం.

శ్వాసతీసుకోలేకపోవడం ఆస్తమా, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ (సిఒపిడి), రక్తహీనత మరియు ఆత్రుత, ఇతరులలో లాంటి నిగూఢమైన సమస్య లక్షణం కావచ్చు. అయితే, నిర్దుష్టంగా రోగనిర్థారణ చేయడం మరియు తగిన చికిత్సతో, సమస్యలన్నిటినీ సులభంగా నియంత్రించవచ్చు మరియు అదుపుచేయవచ్చు.

మీకు అకస్మాత్తుగా బాగా శ్వాసతీసుకోలేకపోతున్న అనుభూతి కలిగితే ఏం చేయాలి

1) భయపడకపోవడానికి ప్రయత్నించాలి, ఎందుకంటే ఇది శ్వాసతీసుకోలేకపోవడాన్ని తీవ్రతరం చేస్తుంది

2) శ్వాసతీసుకోలేకపోవడానికి స్పష్టమైన కారణం లేకపోతే డాక్టరుకు కాల్ చేయండి లేదా ఆసుపత్రికి వెళ్ళండి

3) మీకు ఆస్తమా ఉందని తెలిసినవారైతే, మీ డాక్టరు వివరించినట్లుగా మీ రిలీవర్ ఇన్హేలర్ ని ఉపయోగించండి.

Please Select Your Preferred Language