అలెర్జిక్ రినైటిస్

లక్షణాలు

ఎలర్జిక్ రైనిటిస్ లక్షణాలు సాధారణంగా మీరు ఎలర్జెన్ కి గురైనప్పుడు కలుగుతాయి మరియు వాటిని గుర్తించడం సులభమవుతుంది. కొన్ని ప్రారంభ లక్షణాల్లో ఉండేవి:

  • పదేపదే తుమ్ములు, ప్రత్యేకించి ఉదయం పెందలకడ

  • ముక్కు కారడం మరియు పలచని, నిర్మలమైన పోస్ట్ నాసల్ డ్రిప్, ఇది గొంతు పుండు కలిగించడం

  • కళ్ళు నీళ్ళుకారడం మరియు దురదగా ఉండటం

  • చెవులు, ముక్కు మరియు గొంతు దురద

తరువాత కలిగే లక్షణాల్లో ఉండేవి:

  • ముక్కు దిబ్బడ

  • తలనొప్పి

  • బడలిక మరియు చికాకు

  • చెవులు అవరోధించబడటం

  • వాసన ఇంద్రియానుభూతి తగ్గడం

కొంత కాలానికి, ఎలర్జెన్స్ మిమ్మల్ని తక్కువగా ప్రభావితం చేయవచ్చు, మరియు మీ లక్షణాలు ఇంతకు ముందు కంటే తక్కువ తీవ్రంగా ఉండొచ్చు.

ఎలర్జిక్ రైనిటిస్ వర్సెస్ మామూలు జలుబు

ఎలర్జిక్ రైనిటిస్ లక్షణాలు మామూలు జలుబుతో సులభంగా తికమకపట్టవచ్చు. అయితే, రెండిటి మధ్య తేడా చూపించేందుకు మీకు సహాయపడగల లక్షణాల్లో కొన్ని తేడాలు ఉంటాయి.

ఎలర్జిక్ రైనిటిస్

మామూలు జలుబు

ఎలర్జెన్స్ వల్ల కలుగుతుంది

క్రిముల వల్ల కలుగుతుంది

మీకు సాధారణంగా జ్వరం లేదా ఒళ్ళు నొప్పులు ఉండవు

మీకు జ్వరం మరియు ఒళ్ళు నొప్పులు ఉంటాయి

మీ ముక్కులో కఫం నిర్మలంగా మరియు నీళ్ళుగా ఉంటుంది

మీ ముక్కులో కఫం పసుపుపచ్చగా లేదా ఆకుపచ్చగా మరియు దళసరిగా ఉంటుంది

మీకు తుమ్ములు ఆగిపోవడానికి ముందు, మీరు అనేక సార్లు తుమ్ముతారు

తుమ్ములు అప్పుడప్పుడు వస్తాయి, మరియు సాధారణంగా ఒకసారి కొద్దివాటికే పరిమితమవుతాయి

తీవ్రంగా కళ్ళు నీళ్ళుకారతాయి

కళ్ళు నీళ్ళుకారడం ఉండదు

లక్షణాలు కొద్ది రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటాయి

లక్షణాలు కొద్ది రోజుల్లో పోతాయి

 

మీకు ఎలర్జిక్ రైనిటిస్ లక్షణాల్లో ఏవైనా/అన్నీ ఉన్నట్లుగా కనుగొనబడితే, సరైన రోగనిర్థారణ మరియు చికిత్స కోసం మీరు మీ డాక్టరును సంప్రదించడం ముఖ్యం. ఎలర్జిక్ రైనిటిస్ కి సకాలంలో చికిత్స చేయడం ముఖ్యం, ఎందుకంటే ఇది ఆస్తమా, చెవి ఇన్ఫెక్షన్లు మరియు సైనసైటిస్ లాంటి సంక్లిష్ట సమస్యలకు దారితీయొచ్చు.

Please Select Your Preferred Language