సిఓపిడి

మీకు సిఒపిడి ఎలా కలుగుతుంది (కలిగించేవి)

అనేక ఇతర శ్వాస సమస్యల మాదిరిగా మీరు సిఒపిడితో పుట్టరు. కాబట్టి. దీని నుంచి మిమ్మల్ని కాపాడుకోవడం మీకు పూర్తిగా సాధ్యం. సిఒపిడిని కలిగించే ఏదో ఒక కారకానికి మీరు సుదీర్ఘ కాలం పాటు గురవ్వడం వల్ల మీరు దీనితో బాధపడుతుండొచ్చు.

 

సిఒపిడి గల అత్యధిక మంది ప్రజలకు, ధూమపానం చేసిన చరిత్ర కనీసం కొంతయినా ఉంటుంది. సిఒపిడికి ధూమపానం సామాన్య కారణం అయినప్పటికీ, హానికారక రేణువులకు/పొగ మరియు పొగమంటల యొక్క ఇతర రూపాల్లోని ఇరిటెంట్స్ కి నిరంతరం గురవ్వడం వల్ల కూడా సిఒపిడి కలిగే ప్రమాదం పెరగవచ్చు. సిఒపిడికి గల ఇతర కారణాల్లో కొన్ని, రసాయనిక మరియు వంట నుంచి వెలువడే పొగలు, దుమ్ము, ఇండోర్ లేదా అవుట్ డోర్ గాలి కాలుష్యం, మరియు వెంటిలేషన్ తక్కువగా ఉన్న చోట మరొకరు వదిలిన పొగను పీల్చడం, ఉన్నాయి.

 

కొంత కాలానికి, పొగాకు పొగను లేదా ఇతర హానికారక రేణువులను పీల్చడం వాయుమార్గాలకు చికాకు కలిగిస్తుంది మరియు ఊపిరితిత్తుల యొక్క సాగుడు ఫైబర్లను ప్రభావితం చేస్తుంది.

 

సిఒపిడి అనేది 40 సంవత్సరాల వయస్సు దాటిన ప్రజల్లో అత్యంత సామాన్యమైనది, ఎందుకంటే దెబ్బతిన్న ఊపిరితిత్తులు సిఒపిడి లక్షణాలను కలిగించడానికి సాధారణంగా సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి.

Please Select Your Preferred Language