డాక్టరును ఎప్పుడు సంప్రదించాలి
పరిగెత్తిన తరువాత, రొటీన్ పనిచేసిన తరువాత లేదా హైక్ తరువాత శ్వాసతీసుకోలేకపోతున్నట్లుగా అనిపించడం మామూలు విషయం. నిజానికి ఏదైనా శ్రమతో కూడిన శారీరక పనిచేసిన తరువాత ఊపిరాడకపోవడం పూర్తిగా ఓకే. అయితే, ఈ కింది పరిస్థితుల్లో వేటిలోనైనా మీకు ఊపిరాడకపోతున్నట్లుగా అనిపిస్తే, సమస్యను గుర్తించేందుకు మరియు మీ స్థితిని అదుపుచేసేందుకు మీ డాక్టరును సంప్రదించవలసిన సమయం ఇదే:
- శారీరక పనిచేసిన తరువాత మామూలుగా కంటే ముందుగా మీకు ఊపిరాడకపోతున్నట్లుగా అనిపించడం.
- మీరు శ్రమలేని పనిచేసేటప్పుడు కూడా మీకు ఊపిరాడకపోతున్న అనుభూతి కలగడం.
- కారణం ఏదీ లేకుండానే మీకు ఊపిరాడకపోతున్న అనుభూతి ప్రారంభమవ్వడం.