సిఓపిడి

రోగనిర్ధారణ

సిఒపిడికి ఏక పరీక్ష లేదు. ధూమపానం లేదా పొగమంటలు/పొగ/ఇరిటెంట్ల యొక్క ఇతర రూపాలకు నిరంతరం ఎక్స్ పోజ్ కావడం, లక్షణాలు, శారీరక పరీక్ష గురించి సవివరమైన చరిత్ర తీసుకోవడం ద్వారా మరియు స్పైరోమెట్రీ అనే ఊపిరితిత్తుల పనితనం పరీక్ష ద్వారా సిఒపిడిని ప్రారంభ దశలలో రోగనిర్థారణ చేయడం సాధ్యమే.

కాబట్టి, ఈ లక్షణాలు మిమ్మల్ని అప్పుడే వదిలివెళ్ళవని మీరు కనుగొంటే, మీరు మీ డాక్టరును సందర్శించి, సమస్యను గుర్తించి, చికిత్స చేయించుకోవాలి, తద్వారా మీరు మీ ఊపిరితిత్తులకు జరిగే డేమేజికి మరమ్మతులు చేయడానికి సహాయపడతారు.