పిల్లల్లో ఆస్తమా ఎలా భిన్నంగా ఉంటుంది?
శిశువుకు ఆస్తమా ఉన్నట్లుగా రోగనిర్థారణ చేయబడినప్పుడు, తల్లిదండ్రి అనేక ప్రశ్నలు ఎదుర్కొంటారు-నా శిశువుకే ఎందుకు? నా శిశువు మామూలుగా ఎదుగుతారా? నా శిశువు తనకు ఇష్టమైన ఆటలన్నీ ఆడగులుగుతారా?
కానీ ఆస్తమా గురించి కంగారుపడవలసిందేమీ లేదు. సమస్యను, లక్షణాలను, ప్రేరేపకాలను మరియు చికిత్సలను క్షుణ్ణంగా అర్థంచేసుకోవడం ద్వారా, మీ శిశువు యొక్క ఆస్తమాను నియంత్రణలో ఉంచడం చాలా సులభం, కాబట్టి మీ శిశువు ఆరోగ్యకరమైన మరియు మామూలు జీవితం గడపగలుగుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ఆస్తమా అత్యంత సామాన్యమైన శ్వాస సమస్య. లక్షలాది మంది పిల్లలకు ఆస్తమా ఉంటోంది మరియు వాళ్ళు దాన్ని బాగా అదుపుచేయగలుగుతున్నారు. కాబట్టి, మీరు ఒంటరివారు కారు.
ప్రముఖ నమ్మకానికి విరుద్ధంగా, పిల్లల్లో ఆస్తమా, పెద్దల్లో ఉండే ఆస్తమా ఒకేలా ఉండదు. శ్వాసతీసుకోలేకపోవడం, పిల్లికూతలు, దగ్గు మరియు ఛాతి బిగుసుకుపోవడం లాంటివి పెద్దల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు కాగా, పిల్లలకు ఇవే రకమైన లక్షణాలు ఉండకపోవచ్చు. ఆస్తమా గల అత్యధిక మంది పిల్లలకు దగ్గు ప్రధాన లక్షణంగా ఉంటుంది. వదలకుండా దగ్గు (3-4 వారాల కంటే ఎక్కువ కాలం ఉండేది) పిల్లల్లో ఆస్తమాకు సూచిక కావచ్చు.
సరైన చికిత్స మరియు నిర్వహణతో ఆస్తమాను పూర్తిగా నియంత్రించడం సాధ్యమనే విషయం గుర్తుంచుకోవడం ముఖ్యం, అంటే మీ శిశువు చేయాలనుకున్న ప్రతిదీ మీ శిశువు చేయగలరని దీని అర్థం. ఆస్తమాను పూర్తిగా చికిత్స చేయవచ్చు, కాబట్టి మీ శిశువు యొక్క ఆస్తమా మరియు ఎదుగుదల గురించి మీరు చింతించవలసిన పని లేదు. ఆస్తమాకు చికిత్స చేయడానికి ఇన్హేలర్లు అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఇన్హేలర్ల ద్వారా మందు ఇవ్వబడుతుంది కాబట్టి, ఇది నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది మరియు దుష్ప్రభావాలు తక్కువగా కలిగిస్తుంది. ఆస్తమా మందులు రెండు రకాలుగా ఉంటాయి- కంట్రోలర్స్ మరియు రిలీవర్స్. కంట్రోలర్స్ ని కొంత కాలంలో లక్షణాలను మరియు ఎటాక్ లను నిరోధించేందుకు ఉపయోగిస్తారు. కంట్రోలర్స్ సత్వరం ఉపశమనం కల్పించవని గుర్తుంచుకోవడం ముఖ్యం. రిలీవర్స్ సత్వర ఉపశమనం కల్పిస్తాయి మరియు ఆస్తమా ఎటాక్ సమయంలో ఉపయోగిస్తారు. కంట్రోలర్స్ ని క్రమంతప్పకుండా ఉపయోగించడం రిలీవర్ మందుల అవసరాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
మీ శిశువుకు ఆస్తమా ఉంటే మీరు శ్రద్ధపెట్టవలసిన కొన్ని ముఖ్య విషయాలు ఉన్నాయి:
- మీ శిశువు యొక్క ఆస్తమా ప్రేరేపకాలను గుర్తించి, వాటిని నివారించండి.
- మీ శిశువు యొక్క లక్షణాలను ఎలా అదుపులో ఉంచుకోవాలనే దానిపై మీ పిల్లల డాక్టరును సంప్రదించండి.
- మీ శిశువు కోసం రూపొందించిన ఆస్తమా కార్యాచరణ ప్రణాళికను పాటించండి.
- ఇన్హేలర్లను మరియు ఇతర మందులను కరెక్టుగా ఎలా ఉపయోగించాలనే విషయం తెలుసుకొని, మీ శిశువుకు చెప్పండి.
- కంట్రోలర్ మరియు రిలీవర్ ఇన్హేలర్లకు లేబుల్ అంటించండి, దీనివల్ల తికమక ఉండదు.
- మీ శిశువు ఎల్లప్పుడూ అతని/ఆమె రిలీవర్ ఇన్హేలరును, అతను/ఆమె స్కూలు, పార్కు మరియు ఇతర పర్యటనలు - ఎక్కడికి వెళ్ళినా, వెంట ఉంచుకున్నారని నిర్థారించుకోండి.
- మీ శిశువుకు ఆస్తమాను సులభ మార్గంలో వివరించండి, దీనివల్ల అతను/ఆమె దాన్ని అర్థంచేసుకోగలరు. ఇది ఇన్హేలర్లు అతనికి/ఆమెకు ఎలా సహాయపడతాయో మరియు ఆస్తమాకు సంబంధించిన అత్యవసరాలను అతను/ఆమె ఎలా నిరోధించవచ్చో మీరు వివరించడం కూడా సహాయపడుతుంది.
- ఒకవేళ ఆస్తమా ఎటాక్ కలిగితే, మీరు చేయవలసిన మొట్టమొదటి పని మౌనంగా ఉండాలి మరియు అంతా సవ్యంగానే జరుగుతుందని మీ శిశువుకు హామీ ఇవ్వాలి. ఇలా చేసేటప్పుడు, ఎటాక్ సమయంలో మీ శిశువుకు సహాయపడేందుకు ఆస్తమా అత్యవసర సూచనలు పాటించండి.
- మీ శిశువు యొక్క ఆస్తమా గురించి మీ కుటుంబానికి, సంరక్షకులకు మరియు స్కూలుకు తెలియజేయండి, ఆస్తమా కార్యాచరణ ప్రణాళికను వారితో పంచుకోండి మరియు వాళ్ళకు మీ అత్యవసర సంప్రదింపు సమాచారం ఇవ్వడం మరచిపోకండి.
- చేయవలసిన అత్యంత ముఖ్య పని, కిడ్ గా ఉండకుండా మీ శిశువును ఆపకూడదు. మీ శిశువు నాట్యం చేయాలనుకుంటే , ఆటలు ఆడాలనుకుంటే, ఈతకొట్టాలనుకుంటే లేదా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే, వాళ్ళను చేయనివ్వండి. మీ శిశువుకు ఆస్తమా ఉన్నంత మాత్రాన, వాళ్ళకు వినోద భరితమైన బాల్యం ఉండదని అర్థం కాదు.