ఆస్తమా గురించి
ఆస్తమా అనేది భయం మరియు ఆత్రుతను కలిగించే స్థితి. నిజం చెప్పాలంటే, దీని గురించి ఆందోళన చెందవలసినది ఏమీ లేదు. సరళంగా చెప్పాలంటే, ఆస్తమా అనేది ఊపిరితిత్తుల్లో వాయుమార్గాలను ప్రభావితం చేసే శ్వాస సమస్య. వాయుమార్గాలు కొన్ని సార్లు కొన్ని పదార్థాలకు ప్రతిస్పందించడం వల్ల, వాటి చుట్టూ ఉన్న కండరాలను బిగుతుగా చేస్తాయి, ఈ కారణంగా వాయు మార్గాలు ఇరుకుగా మారి, శ్వాస తీసుకోవడాన్ని కష్టం చేస్తాయి. ఇది వాయుమార్గాల లైనింగులో అదనపు కఫం స్రవించడానికి కూడా దారితీయొచ్చు, దీనివల్ల వాయుమార్గాలు మరింతగా ఇరుకుగా మారతాయి. వినడానికి ఇవన్నీ భయంకరంగా ఉన్నప్పటికీ, అంతగా భయపడవలసిన పని లేదు.
‘‘మామూలు క్రియాశీల జీవితం తిరిగి గడపడానికి మీరు కట్టుబడవలసిన అవసరం లేదు’’
కాబట్టి, ఆస్తమా కొనసాగుతుందా లేదా ఇది వచ్చి, పోతుందా? సీజనల్ ఆస్తమా అనే స్థితి ఉంది, దీనిలో మీ లక్షణాలు ఒక సీజనులో తీవ్రం కావచ్చు మరియు మరొక సీజనులో కనిపించకపోవచ్చు. ఆస్తమా అనేది స్పష్టమైన కారణం లేకుండా, వస్తూ, పోతుండే స్థితి అనే అపోహ కలిగిస్తుంది. అయితే, సుదీర్ఘ కాలం పాటు ఆస్తమా మీతో ఉండిపోతుంది. కానీ మీరు ఆస్తమా గురించి మరింతగా తెలుసుకుంటే, ఆస్తమాను అదుపుచేయడం మరియు ఆస్తమా ఎటాక్ ని ఊహించడం మరియు నిరోధించడం అంత కష్టం కాదు.
ప్రతి ఒక్క వ్యక్తి ఆస్తమా ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఆస్తమాను విజయవంతంగా అదుపుచేస్తున్న మీ లాంటి అనేక మంది ప్రజలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 300 మిలియన్ల మంది ప్రజలకు ఆస్తమా ఉండగా, భారతదేశంలో 25 నుంచి 30 మిలియన్ల మందికి ఉన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కనుగొంది. కాబట్టి ఇది మామూలు స్థితి, మరియు ఖచ్చితంగా మీరు ఒంటరి వారు కాదు.
వీడియో: ఐస్ క్రీమ్ గురించి ఆస్తమాపై దీని ప్రభావాల గురించి డా. కుమార్ మాట్లాడుతున్నారు
దురద్రుష్టవశాత్తూ ఆస్తమాకు రోగనాశకం లేనప్పటికీ, ఆధునిక మందులు దీని లక్షణాలను పూర్తిగా నియంత్రించడాన్ని సాధ్యం చేస్తున్నాయి, దీనివల్ల మీకు ఆస్తమా ఉందనే విషయం మీరు దాదాపుగా మరచిపోవచ్చు. కాబట్టి, కేవలం ఆస్తమా ఉందనే కారణంతో మామూలు క్రియాశీల జీవితం గడపడానికి మీరు కట్టుబడవలసిన అవసరం లేదు. సినీ పరిశ్రమ, వ్యాపార రంగం, మరియు క్రీడా రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖ వ్యక్తులకు ఆస్తమా ఉంది, కానీ వీళ్ళు ఫలప్రద జీవితం గడపకుండా ఇది ఆపలేదు.
కుడి చేతి వైపు బ్యానర్ 1 - ఆస్తమాను నేహా ఎలా జయించారో మరియు తన మొదటి 4 కి.మీ ఎలా పరిగెత్తారో చదవండి (స్ఫూర్తిదాయక కథలు)
కుడి చేతి వైపు బ్యానర్ 2 - నాకు ఆస్తమా ఉన్నప్పటికీ నేను వ్యాయామం చేయగలనా లేదా ఆటలాడగలనా? (ఎఫ్ఎక్యూ)
కుడి చేతి వైపు బ్యానర్ 3 – తమ శ్వాస సమస్యలను విజయవంతంగా అధిగమించిన ప్రజలతో కనెక్టు అయ్యేందుకు కమ్యూనిటిలో చేరండి (బ్రీత్ ఫ్రీ కమ్యూనిటి)
ఆస్తమాను ప్రేరేపించేవి
వాయు మార్గాలకు చికాకు కలిగించే దుమ్ము పురుగుల నుంచి డియోడరంట్ల వరకు ఏదైనా ప్రేరేపకం కావచ్చు, ఇది ఆస్తమా లక్షణాలను పెంచుతుంది మరియు ఆస్తమా ఎటాక్‌కి దారి తీస్తుంది. ప్రముఖ విశ్వాసానికి విరుద్ధంగా, ప్రత్యేకించి ప్రేరేపకాలను మీరు గుర్తించగలిగితే, ఆస్తమా ఎటాక్‌ని ఊహించడం సాధ్యమేనని. అయితే, ప్రతి ఒక్కరి ఆస్తమా భిన్నంగా ఉంటుంది కాబట్టి, మరియు వాటి ప్రేరేపకాలు కూడా భిన్నంగా ఉంటాయనే విషయం గుర్తుంచుకోవడం ముఖ్యం. మీ ఆస్తమా ప్రేరేపకాలను తెలుసుకోవడం మీ ఆస్తమా ఎటాక్‌లను ఊహించడం మరియు నిరోధించడానికి మరియు దాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
కొన్నిసార్లు ప్రేరేపకాలను గుర్తించడం సులభంకావచ్చు, మరి కొన్నిసార్లు గుర్తించలేకపోవచ్చు. అయితే, మీ ప్రేరేపకాలు ఏమిటో కనుగొనడానికి మీ డాక్టరు మీకు సహాయపడగలుగుతారు, మరియు వాటిని నివారించడానికి మీరు ఉత్తమంగా చేయవచ్చు.
కొన్ని అత్యంత సామాన్యమైన ఆస్తమా ప్రేరేపకాలు ఇవి (ఇది ఇన్ఫోగ్రాఫిక్ జాబితా)
దుమ్ము పురుగులు- మ్రాట్రెస్‌లు, కర్టెన్లు, మరియు సాఫ్ట్ టాయ్స్ పై ఉండే దుమ్ములోని పురుగులు.
పుప్పొడి- పూల మొక్కలు తరచుగా విడుదల చేసే పుప్పొడి కొంతమంది ప్రజలకు ప్రేరేపకం కావచ్చు.
సిగరెట్ పొగ మరియు వాయుకాలుష్యకాలు- టపాసుల పొగ, ఎగ్జాస్ట్ ఫ్యూమ్‌లు, మరియు సిగరెట్ పొగ ఆస్తమా ఎటాక్‌ని ప్రేరేపించవచ్చు.
పెంపుడు జంతువులు - వీటి వెంట్రుకలు, ఈకలు, లాలాజలం మరియు ఉన్ని ఆస్తమాను ప్రేరేపించవచ్చు.
వృత్తిపరమైన ప్రేరేపకాలు - ప్రింటింగ్ ప్రెస్‌లు, పెయింట్ కర్మాగారాలు, నగల తయారీ, క్వారీలు లాంటి పరిశ్రమల్లో పనిచేయడం, మీ ఆస్తమాకు కారణం కావచ్చు.
జలుబు మరియు వైరసులు - మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఆస్తమా ఎటాక్‌లను దూరంగా ఉంచడానికి సహాయపడవచ్చు.
మందులు - కొన్ని మందులు మీ శరీరంతో చెడ్డగా ప్రతిస్పందించవచ్చు. కాబట్టి, మీ మందులన్నిటి గురించి మీ డాక్టరుకు తెలియజేయండి.
వ్యాయామం - మిమ్మల్ని ఫిట్ గా ఉంచుకునేందుకు వ్యాయామం మంచి మార్గం. అయితే, కొంతమంది ప్రజలకు శారీరక కార్యకలాపాలు కూడా ఆస్తమా ఎటాక్‌కి కారణం కావచ్చు.
ఆహారం - ఆస్తమా గల ప్రతి ఒక్కరికీ ఖచ్చితమైన ఆహారం అవసరం లేదు, కానీ కొంతమందికి పాలు, ఫిజీ డ్రింక్స్ మరియు నట్స్ లాంటి కొన్ని ఆహారాలకు ఎలర్జీలు ఉండొచ్చు.
వాతావరణం - ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు కూడా ఆస్తమాకు ప్రేరేపకం కావచ్చు.
బూజు మరియు ఫంగీ – తేమ గోడలకు ఎక్స్ పోజర్, కుళ్ళిపోయిన ఆకులు మరియు ఫంగీ ఆస్తమాకు ప్రేరేపకాలనే విషయం తెలుస్తోంది.
బలమైన భావోద్వేగాలు - ఒత్తిడి మీ శరీరాన్ని పోరాట పద్ధతిలోకి తీసుకెళుతుంది కాబట్టి, ఆస్తమా ప్రేరేపకంగా పనిచేస్తుంది.
హార్మోన్లు - మహిళల్లో హార్మోన్లు ఆస్తమాకు ప్రేరేపకం కావచ్చు. కొంతమంది రజస్వల, వాళ్ళ బహిష్టు చక్రం మరియు గర్భధారణకు కొద్ది ముందుగా ఆస్తమా ఎటాక్ లను అనుభవించవచ్చు.
దోమల కాయిల్స్, రూఫ్ ఫ్రెష్‌నర్స్ మరియు క్లీనింగ్ ఉత్పాదనలు - వీటిల్లో ఉపయోగించే రసాయనాలు మీ వాయుమార్గాలకు చికాకుగా పనిచేయవచ్చు, మరియు ఆస్తమా ఎటాక్ ని ప్రేరేపించవచ్చు.
For more information on the use of Inhalers, click here