సిఓపిడి

సిఒపిడికి చికిత్స చేయుట (చికిత్స)

సిఒపిడికి రోగనాశకం లేదు, కానీ దీన్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయపడే చికిత్సలు ఉన్నాయి; మరియు మీకు సిఒపిడి మాత్రం ఉండటం కారణంగా మీరు సంపూర్ణ జీవితం జీవించలేరని అర్థం కాదు. సరైన మందులు, తగిన ఆహారం మరియు జీవన విధానం మార్పులతో మీరు సిఒపిడిని సులభంగా అదుపు చేసుకోవచ్చు.

 

ఎ)    ధూమపానం చేయకండి

 

మీరు ధూమపానం చేస్తుంటే, దాన్ని మానుకోండి. మీరు చేసుకోవలసిన అత్యంత ముఖ్యమైన ఏకైక జీవన విధానం మార్పు ఇది. మీకు ఎంత కాలంగా అలవాటు ఉందనే దానితో నిమిత్తం లేకుండా, ధూమపానం మానుకోవడం, ఊపిరితిత్తుల కణజాలాలకు డేమేజ్ ని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. మీరు ధూమపానం మానుకోవడానికి సహాయపడే ఉత్పాదనలు ఇప్పుడు లభిస్తున్నాయి. మీ డాక్టరు వీటిని మీకు చెబుతారు.

 

బి)    ఇతర ఊపిరితిత్తుల ఇరిటెంట్లను నివారించండి

 

ధూమపానమే కాకుండా మరొకరు వదిలిన పొగను పీల్చడం, రసాయనిక పొగలు మరియు దుమ్ము లాంటి మీ ఊపిరితిత్తులకు చికాకు కలిగే ఇతర కారకాలు ఉండొచ్చు, వీటిని మానుకోవాలి.

 

సి)    సరైన మందును క్రమంతప్పకుండా తీసుకోండి

 

లక్షణాలను మందులు  తగ్గించవచ్చు మరియు వ్యాధి ప్రకోపించడాన్ని తగ్గిస్తాయి. సిఒపిడి మందు వాయుమార్గాలకు 2 విధాలుగా సహాయపడుతుంది- వాటిని వెడల్పు చేస్తుంది మరియు వాపును తగ్గిస్తుంది. సిఒపిడికి లభిస్తున్న ఆధునిక మందులన్నీ చాలా ప్రభావవంతమైనవి, మరియు మీ జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అత్యధిక మందులు పీల్చుకునే రూపంలో లభిస్తున్నాయి, ఎందుకంటే ఇన్హేలర్లు సురక్షితమైనవి. లక్షణాలను అదుపుచేయడానికి మందులను క్రమంతప్పకుండా తీసుకోవాలి (డాక్టరు సూచించినట్లుగా).

 

కొన్నిసార్లు, రక్తంలో ఆక్సిజెన్ స్థాయిలు పడిపోవడం సిఒపిడి కలిగించవచ్చు. మీరు దీని గురించి ఉద్రిక్తమవ్వడానికి ముందు, అనుబంధక ఆక్సిజెన్ తో దీన్ని సులభంగా పరిష్కరించవచ్చు.

 

డి) వ్యాక్సిన్స్

సిఒపిడి గల ప్రజలకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్ ని తీసుకోవలసి ఉంటుంది.

Please Select Your Preferred Language