ప్రేరణలు

ఆస్తమాను దూరంగా పారదోలుట

 ‘‘నేను అతనికి వరుణ్ అనే పేరు పెట్టాను’’. అతని తండ్రి కూడా, అతను గాలి అంత స్విఫ్ట్‌గా ఉండాలి. కానీ అతను కొద్ది నెలల వయస్సులో ఉన్నప్పుడు, జరిగిన ఒక సంఘటన నిజంగా మమ్మల్ని పట్టించుకోనని విధంగా చేసింది.

వరుణ్ కి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. మేము వివిధ డాక్టర్ల వద్దకు వెళ్ళాము. నిరంతరం మందులు మరియు ఇంజెక్షన్లు ఇప్పుడు మా జీవితాల్లో భాగమయ్యాయి. అనేక సంవత్సరాల పాటు నిద్రలేని రాత్రులు గడిపాము.

 

అతను చాలా చిన్నగా మరియు సుకుమారంగా ఉన్నాడు. నేను నిజంగా భయపడిపోయాను. ఎప్పుడు, ఎక్కడ, ఎప్పుడు లాంటి ప్రశ్నలకు ఇప్పుడు అర్థం లేదు. కానీ అతను వదిలేయలేదు. అతను టైక్వాంన్-డో చేపట్టాడు. నేను కూడా అతన్ని ప్రోత్సహించాను మరియు తన పరంగా తప్పు జరిగిందని అతను ఎప్పుడూ అనుకోలేదని నిర్థారించుకున్నాము.

 

ఒక రోజున, వరుణ్ పూర్తిగా మానసిక వ్యధతో ఇంటికి వచ్చాడు. అతని వయస్సు 8 ఏళ్ళు. అతను టైక్వాంన్-డో ఫైనల్స్ కి చేరుకున్నాడు. ఈ విజయం అతనికి ప్రపంచంలో ప్రతిదీ సాధించినట్లుగా అనిపించింది. తనను బయటకు ఎలా పంపిందీ అతను కన్నీటితో నాకు చెప్పాడు, ఎందుకంటే శ్వాస తీసుకోవడం అతనికి కష్టంగా అనిపించింది.

 

నేను అతని తండ్రితో మాట్లాడాను. వరుణ్ కి మామూలు జీవితం ఇస్తామని నిర్థారించుకునేందుకు ప్రపంచంలోని ఉత్తమ సంరక్షణ కనుగొనాలని మేము నిర్ణయించుకున్నాము. మేము ఒక స్పెషలిస్టు డాక్టరు వద్దకు తీసుకెళ్ళగా, వరుణ్ కి ఆస్తమా ఉందని మాకు చెప్పారు.

 

ఏం చేయాలో మాకు తెలియలేదు. ఎదిగిన పిల్లలు మాత్రమే ఎదుర్కొనే సమస్య వరుణ్ కి ఎలా కలిగిందా అని మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. మరియు మేము ఇన్హేలర్ల గురించి ఆలోచించలేకపోయాము. అన్నిటికీ మించి, మాకు వాటి గురించి చాలా ప్రశ్నలు ఉన్నాయి, మరియు వీటికి పరిష్కారం ప్రయత్నించి, కనుగొనవలసిందిగా మేము మా ఆత్మీయులతో మరియు పొరుగువారితో మాట్లాడాము. మేము ఎక్కడ తిరిగామనే దానితో నిమిత్తం లేకుండా, మాకు ఒకే ఒక స్పందన లభించింది. ఇన్హేలర్లు పిల్లల ఎదుగుదలను గిడసబారిస్తాయి. వరుణ్ మామూలుగా ఎదగడు.

 

మేము పూర్తిగా మానసిక వ్యధ చెందాము. మేము భయపడి, వరుణ్ ఆస్తమాకు చికిత్స చేయడానికి ప్రత్యామ్నాయ చికిత్స ఏదైనా ఉందా అనే విషయం తెలుసుకునేందుకు డాక్టరు వద్దకు వెళ్ళాము. అయితే కంగారుపడవలసింది ఏమీ లేదని డాక్టరు మాకు చెప్పారు. మేము ఇన్హలేషన్ థెరపి ప్రారంభించాము. మరియు నెమ్మదిగా, కానీ ఖచ్చితంగా, మేము ఫలితాలను చూడటం ప్రారంభించాము.

టైక్వాంన్-డోలో మెరుగ్గా రాణించడానికి వరుణ్ పనిచేస్తూ ఉన్నాడు. ఇన్హేలర్ థెరపి మరియు అతని ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రతి స్టెప్లో అతనికి సపోర్టు ఇచ్చాయి మరియు ఆస్తమా అతన్ని ఆపలేదు.

వరుణ్ కి ఆస్తమా ఉందంటే నేడు ఎవ్వరూ నమ్మరు; మరియు అతను అనేక మెడల్స్ ని సగర్వంగా ధరిస్తున్నాడు.

Please Select Your Preferred Language