మా గురించి

బ్రీత్‌ఫ్రీ గురించి

బ్రీత్‌ఫ్రీ అనేది దీర్ఘకాలిక వాయుమార్గం వ్యాధులు గల రోగులకు సిప్లా అందిస్తున్న ప్రజా సేవా కార్యక్రమం. సిప్లా 75 సంవత్సరాల వేడుకల సందర్భంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నేడు బ్రీత్‌ఫ్రీ అనేది శ్వాస సంరక్షణకు సమగ్ర రోగి మద్దతు వ్యవస్థ. ఆస్తమా, సిఒపిడి మరియు ఎలర్జిక్ రైనటిస్ లాంటి వాయుమార్గం వ్యాధులు గల రోగులకు సహాయపడేందుకు బ్రీత్‌ఫ్రీ కట్టుబడివుంది. రోగనిర్ధారణ, కౌన్సెలింగ్ మరియు చికిత్సకు కట్టుబడే విషయాల్లో సంపూర్ణ రోగి ప్రయాణం దీనిలో ఉంటుంది. శ్వాస సమస్యలు గల ప్రజలు మామూలు మరియు క్రియాశీల జీవితం ఎలా గడపవచ్చనే విషయం గురించి చైతన్యం కల్పించేందుకు మరియు పెంచేందుకు ఇన్నేళ్ళలో బ్రీత్‌ఫ్రీ అనేక కార్యక్రమాలు మరియు శిబిరాలు నిర్వహించింది.

బ్రీత్‌ఫ్రీ క్లినిక్లూ, కెమిస్టులు మరియు కౌన్సెలింగ్ సెంటర్లతో కూడిన బ్రీత్‌ఫ్రీ నెట్వర్క్ సహాయంతో, శ్వాససంబంధ కష్టాలను విజయవంతంగా జయించిన సమాజాన్ని, మరియు పూర్తిగా ఆరోగ్యకరమైన జీవితం గడిపే మార్గాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు సపోర్టు సిస్టమ్‌ని బ్రీత్‌ఫ్రీ సృష్టించింది.

దీర్ఘకాలిక వాయుమార్గ వ్యాధులకు సంబంధించిన సమాచారం మొత్తం లభిస్తున్న ఏకైక చోటు www.breathefree.com. ఆస్తమా, సిఒపిడి మరియు ఎలర్జిక్ రైనటిస్ లాంటి సమస్యలకు సమాచారం, పరిష్కారాలు మరియు మద్దతును ఈ వెబ్‌‌సైట్ ఇస్తుంది. పైగా, రోగనిర్థారణలో సహాయపడగల మరియు కౌన్సెలింగ్ ద్వారా సరైన చికిత్సలో మద్దతు ఇవ్వగల కౌన్సెలర్లను సంప్రదించడానికి కూడా వెబ్‌‌సైట్ సహాయపడుతుంది.

Please Select Your Preferred Language