Home
  Breathe Free
ఇది దగ్గా లేదా
ఆస్త్‌మానా?
చికిత్స మరియు నియంత్రణ
FAQ & మద్దతు
అలర్జిక్ రైనైటిస్
COPD

ఆస్త్‌మా విశ్లేషణ

ఆస్త్‌మా విశ్లేషణ  

మీరు ప్రేమించేవారికి ఆస్త్‌మా ఉన్నట్లు కనుగొంటే, మీరు ఆందోళన పడనఖ్ఖరలేదు. మీరు కంగారుపడవలసిన అవసరం లేదు, మరియు మీ ఉద్యోగం లేదా మీ నగరం మారవలసిన అవసరం లేదు. ఒలంపిక్ ఆటగాళ్ళకి ఆస్త్‌మా ఉంది, ప్రసిద్ధికెక్కిన క్రికెటర్లకి ఆస్త్‌మా ఉంది, సినిమా తారలకి ఆస్త్‌మా ఉంది, నేతలకి ఆస్త్‌మా ఉంది, కాని వీరెవ్వరు దానిని తమ దైనిక జీవితానికి అడ్డురానీయలేదు.

ఆస్త్‌మాని నియంత్రించడానికి సరైన మార్గం మీ ట్రిగ్గర్స్‌ని అర్థం చేసుకోవడమే, మీ లక్షణాల గురించి జాగ్రత్త పడడం, మరియు మీ మందులు సరిగ్గా తీసుకొనడం. కాని ముందు దానిని సరిగ్గా నిర్ధారించాలి.

భారతదేశంలో, చాలా మంది తల్లితండ్రులు తమ బిడ్డకి ఆస్త్‌మా ఉందని అంగీకరించరు. తమ బిడ్డకి ‘ఆస్త్‌మా’ అనే పదం బదులు కేవలం ‘వీజింగ్ బ్రోంకైటిస్’ లేదా ‘ఎలర్జిక్ బ్రోంకైటిస్’ ఉందని వారు వినడానికి ఇష్టపడతారు. వారు ఒక డాక్టర్ నుండి మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, తమకి మరియు తమ బిడ్డకి కూడా ఎంతో ఒత్తిడి కలిగించుకుంటారు, కాని నిజానికి ఆస్త్‌మాని త్వరగా కనిపెట్టి, దానికి త్వరగా చికిత్స చేస్తే, వారి బిడ్డ మామూలు జీవితాన్ని త్వరగా సాగించగలరు. . పిల్లలు పిల్లల లాగే ఉండాలి మరియు ఆస్త్‌మా ఉన్న పిల్లవాడు కూడా సరైన చికిత్స ఇస్తే మామూలు పిల్లవాడు చేసేవి అన్ని చేయగలడు - స్కూలుకి రోజూ వెళ్ళడం, ఆటలు ఆడడం, ఇంకా, ఐస్‌క్రీమ్ కూడా తినవచ్చు! Click here for Patient films

ఆస్త్‌మాని సులభంగా కనిపెట్టవచ్చు కాని అప్పుడప్పుడు దానిని మళ్ళీ మళ్ళీ వచ్చే దగ్గుగా అపోహపడి, దానిని అశ్రద్ధ చేసి లేదా సమయానికి చికిత్స చేయకుండా లేదా దగ్గు మందులతో చికిత్స చేస్తారు. చాలా సార్లు, ఆస్త్‌మా వంశపారంపర్యంగా వస్తుంది. మీ యొక్క లేదా మీ బిడ్డ ఆస్త్‌మాని నిర్ధారించడానికి మీ డాక్టర్‌కి సహాయపడడానికి, మీరు మీ డాక్టర్‌ అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలని ఇవ్వాలి. ప్రశ్నలు మీ లక్షణాల గురించి, మీ వంశచరిత్ర గురించి, మీరు తీసుకుంటున్న మందుల గురించి, మీకు ఉన్న అలర్జీలు మొదలైనవి ఉండవచ్చు. దీనిని మెడికల్ హిస్టరీ (వైద్య చరిత్ర ) అని అంటారు. చాలా నిర్ధారణ మెడికల్ హిస్టరీపై ఆధారపడి ఉంటుంది. డాక్టర్ కూడా ఒక శారీరక పరీక్ష చేసి ఆపై మిమ్మల్ని పీక్ ఫ్లో మీటర్ / (బ్రీతోమీటర్) మరియు స్పైరోమెట్రీ పరీక్షలని చేయించుకోమని మీకు సిఫారసు చేస్తారు.

ఆస్త్‌మాని కనుగొంటే అప్పుడు మీరు దానిని నియంత్రించడానికి కావలసిన చికిత్సని ప్రారంభించవలసి ఉంటుంది. ఆస్త్‌మాని నియంత్రించడమే ఆస్త్‌మా ఉన్నవారికి ముఖ్యమైనది, అంటే మీ ఆస్త్‌మా ఎక్కువ అవుతుందో లేక తగ్గుతుందో తనిఖీ చేయడం. మీకు ఎలాంటి మందులు ఇవ్వాలో తెలపడంలో మరియు అవసరం ఉంటే మోతాదుని మార్చడానికి మీ డాక్టర్‌కి సహాయపడుతుంది.









పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్)   

పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) అనేది ఒక ఎక్కువ ఖరీదు కాని, సులభమైన, చేతితో పట్టుకుని వాడే పరికరం. దానితో పిల్లలు మరియు పెద్దలలో ఊపిరి పీల్చుకోవడంలో గల ఇబ్బందులు మరియు ఆస్త్‌మాని నిర్ధారించవచ్చు. మీరు ఆస్త్‌మా యొక్క చికిత్సని తీసుకునేటప్పుడు ఈ పరికరంతో మీ అభివృద్ధిని కూడా కొలవవచ్చు.

మీకు రక్తపోటు కొలవడానికి బిపి పరికరం మరియు మధుమేహం కొలవడానికి గ్లూకోమీటర్ ఉన్నట్లు పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) ఆస్త్‌మా కోసం ఒక థర్మామీటర్ వంటిది. మీరు రోగి అయితే ఆ పరికరం మొదలులోకి గాలిని ఊదితే, మీ ఊపిరితిత్తుల బలాన్ని తనిఖీ చేయడానికి రీడింగ్ తీసుకోబడుతుంది. చాలామంది డాక్టర్‌లు తమ క్లినిక్‌లో ఆ పరికరాన్ని పెట్టుకుంటారు కాని మీరు మీ ఆస్త్‌మాని నియంత్రించాలని అనుకుంటే, దానిని మీరు పెద్ద మందుల దుకాణాల్లో కొనుక్కోవచ్చు.


మీకు ఆస్త్‌మా ఉంటే మీరు పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) ఉపయోగించి మీ స్థితి మెరుగవుతోందో లేదో తెలుసుకోవచ్చు. మీ డాక్టర్ మీకు పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) పైనున్న సంఖ్యని లేదా రీడింగ్‌ని చూపించి, మీ వయస్సు మరియు ఎత్తు ప్రకారం మీకు మంచిదో కాదో చెప్పగలరు. మీ రీడింగ్ మరీ తక్కువగా ఉంటే, దాని అర్థం మీ ఆస్త్‌మా నియంత్రించబడలేదని మరియు మీకు దగ్గరలో అంటే కొన్ని రోజులలోనే ఎటాక్ రాగలదు. అది ఒక ముందుగానే వచ్చే సంకేతం లాంటిది, మరియు దాన్ని బట్టి మీరు మీ మందు యొక్క మోతాదును పెంచాలో లేదా ఎన్ని సార్లు ఎక్కువ చేయాలో తెలుపుతుంది. ముందుసారి రీడింగ్ కన్నా సంఖ్య ఎక్కువగా ఉంటే, దాని అర్థం మీ ఆస్త్‌మా నియంత్రించబడిందని మరియు మీరు మెరుగుపడుతున్నారు. పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) రీడింగ్ మామూలుగా ఉంటే (మీ డాక్టర్ మీకు ఆ రీడింగ్ తెలియచేస్తారు), ఇది మీ ఆస్త్‌మా నియంత్రించబడిందని సూచిస్తుంది.









స్పైరోమెట్రీ పరీక్ష  

స్పైరోమెట్రీ పరీక్ష అనేది ఆస్త్‌మా చిహ్నాలని త్వరగా కనుగొనే ఎంతో సున్నితమైన మరియు అధునాతనమైన పరీక్ష. మీ ఊపిరితిత్తులు ఎంత గాలిని ఉంచుకోగలవో మరియు మీ ఊపిరితిత్తులు లోపలికి మరియు బయటకి ఎంత గాలిని వదలగలవో కొలవడానికి స్పైరోమీటర్ ఉపయోగించబడుతుంది. మరొక విధంగా చెప్పాలంటే, ఇది మీ ఊపిరితిత్తుల సమర్థత గురించి చక్కని సూచనను ఇస్తుంది మరియు మీకు మీ ఉచ్ఛ్వాసం యొక్క సమర్ధత గురించి ఖచ్చితమైన వివరాలను ఇస్తుంది. పరీక్షని చేస్తున్న డాక్టర్ లేదా లాబ్ మీరు ECG పరీక్షని చేయించుకున్నప్పుడు ఇచ్చే ముద్రించిన గ్రాఫ్ లాంటి, మీ రీడింగ్ ఉన్న గ్రాఫ్‌ని మీకు ఇస్తారు.

పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) మరియు స్పైరోమెట్రీ పరీక్షలు, ఈ రెండు ఆస్త్‌మాని నిర్ధారించడానికి ఉపయోగించబడతాయి మరియు మీ ఆస్త్‌మా మెరుగుపడుతున్నప్పుడు మీ స్థితిని కొలవడానికి కూడా సహాయపడతాయి.

కాని ఈ పరీక్షలు ఆరేళ్ళు నిండని పిల్లలకి సిఫారసు చేయబడలేదు, అందుకే మీరు పేరంట్‌గా మీ కుటుంబ చరిత్ర మరియు ట్రిగ్గర్స్ దృష్టిలో ఉంచుకొని మీ బిడ్డ యొక్క ఆస్త్‌మా త్వరగా మరియు సరిగ్గా నిర్ధారించడానికి మీ పిడియాట్రీషన్‌తో కలిసి పని చేయాలి. ఇంతేకాక మీరు మీ బిడ్డ యొక్క స్థితిని పర్యవేక్షించడానికి మీ డాక్టర్‌ని క్రమం తప్పకుండా సంప్రదించడం కూడా అవసరం.




 
పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్)   
పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) అనేది ఒక ఎక్కువ ఖరీదు కాని, సులభమైన, చేతితో
పట్టుకుని వాడే పరికరం.
స్పైరోమెట్రీ పరీక్ష  
స్పైరోమెట్రీ పరీక్ష అనేది ఆస్త్‌మా చిహ్నాలని త్వరగా కనుగొనే ఎంతో సున్నితమైన
మరియు అధునాతనమైన పరీక్ష.