చెన్నయ్లో ఆస్థమా జాగృతి కార్యక్రమం
ఆస్థమా జాగృతి కార్యక్రమం విద్యా సంబంధిత వెబ్‌సైట్ www.breathefree.com ని ప్రారంభించడానికి 2010 మే 16న చెన్నయ్‌లో నిర్వహించబడింది. దీన్ని బలపర్చడానికి, సంగీత దర్శకుడు రమేష్ వినాయగం, చిత్ర దర్శకుడు చంద్రశేఖర్, చిత్ర దర్శకుడు వసంత్, కర్నాటిక్ గాయకుడు డా. గణేష్ వెబ్‌సైట్‌ని ప్రారంభించారు మరియు తమ ఆస్థమాను తాము ఎలా నియంత్రించుకున్నారో తమ అనుభవాలను కూడా పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి 300 మంది ప్రజలు హాజరయ్యారు, వీరిలో కొందరు ఆస్థమా రోగులు ఇన్హేలేషన్ థెరపీని స్వీకరించిన తర్వాత తమ జీవితాలు ఎలా మారాయి అనే విషయంపై తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమానికి వచ్చినవారిని ఆస్థమా గురించి సరైన చికిత్సగురించి చైతన్యపర్చేందుకు, ‘ఇమ్సాయ్ అరసన్ ఇరందమ్ పులికేసియమ్’ పేరిట ఒక నాటకం ప్రదర్శించారు. ఈ నాటకం Cipla రెస్పిరేటరీ టీమ్ ద్వారా రచించబడి, ప్రదర్శించబడింది. డా.జి.ఎస్ కైలాస్‌తో జరిపిన ‘మాయాండి దర్బార్’ ఇంటరాక్టివ్ సెషన్, ఆస్థమాతో వ్యవహరించడంపై తమకున్న సందేహాలను తీర్చడానికి తగిన వేదికను అందించింది.