పాఠశాలలో ఆస్థమా అత్యవసర పరిస్థితులతో వ్యవహరించడంలో అధ్యాపకులకు మరియు పాఠశాల అధికారులకు సాధికారత కల్పించడంలో ప్రారంభ చర్యలో భాగంగా, Cipla ద్వారా ప్రారంభించబడిన ప్రజా సేవా సంస్థ బ్రీత్‌ఫ్రీ కొల్‌కతాలో ‘ఆస్థమా అలర్ట్ స్కూల్స్’ని 17 సెప్టెంబర్ 2010న ప్రారంభించింది. భారతదేశంలో ఇది మొట్టమొదటి ప్రారంభచర్య, దీంట్లో ఉపాధ్యాయులు ఆస్థమా దాడి సమయంలో ప్రథమచికిత్సను నిర్వహించడంలో మరియు పిల్లవాడిలో ఆస్థమా లక్షణాలను గుర్తించడంలో మరియు దాన్ని తల్లిదండ్రులకు సమర్థవంతంగా వివరంగా చెప్పడంలో శిక్షణ పొందుతారు.
డా. సుబాసిస్ రాయ్, కన్సల్టెంట్ పిడియాట్రిషియన్, కొలంబియా ఆసియా హాస్పిటల్ & సిషు సంజీవన్ హాస్పిటల్, సాల్ట్ లేక్ అండ్ డా. పల్లబ్ చటర్జీ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, కొలంబియా ఆసియా హాస్పిటల్ & ఎఎమ్ఆర్ఐ హాస్పిటల్, సాల్ట్ లేక్, భారతదేశంలో ‘ఆస్థమా అలర్ట్ స్కూల్స్’ని సాకారం చేయవలసిన అవసరంపై పత్రికా సదస్సులో ప్రసంగించారు.
మిసెస్ ఎమ్. నార్మన్, గౌరవ ప్రిన్సిపాల్ - అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్, టోల్లీగంజ్ మరియు మిసెస్ లీనా హరాథి, గౌరవ ప్రిన్సిపాల్, ఆంధ్రా అసోసియేషన్ స్కూల్‌కి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము, వీరు ప్రెస్ ముందు ప్రసంగించడానికి మరియు అత్యవసర పరిస్థితిలో ఆస్థమా ఉన్న పిల్లలతో వ్యవహరించడంలో పాఠశాల సిబ్బందికి ప్రారంభ చర్య ఎలా ప్రయోజనం కలిగించగలదు అనే అంశంపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి ముందుకొచ్చారు.
సుమారు 40 పాఠశాలలనుండి 185 మంది ఉపాధ్యాయులు పాలుపంచుకోవడంతో ఈ వర్క్‌షాప్ చక్కటి స్పందనలను అందుకుంది. ‘ఆస్థమా అలర్ట్ స్కూల్స్’ కేంపెయిన్ మొదటి వర్క్‌షాప్, వైద్యుల నుండి ఆస్థమా గురించి అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయులకు చక్కటి వేదికగా ఉపయోగించబడింది
ఈ ప్రారంభచర్య కొల్‌కతా వ్యాప్తంగా అనేక పాఠశాలలకు చేరడానికి సహకరించిన కోల్‌కతా టీవీ చానల్స్ మరియు పత్రికలకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
మీరు మీ పాఠశాలను ‘ఆస్థమా అలర్ట్ స్కూల్స్’లో ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నట్లయితే, మీరు ఒక అభ్యర్థనను పంపించగలరు @
http://www.breathefree.com/Asthma_Alert_Schools.html