Home
  Breathe Free
ఇది దగ్గా లేదా
ఆస్త్‌మానా?
చికిత్స మరియు నియంత్రణ
FAQ & మద్దతు
అలర్జిక్ రైనైటిస్
COPD

అపోహలు & వాస్తవాలు

ఇతర వ్యాధుల వలనే ఆస్త్‌మా గురించి ఎన్నో అనుమానాలు, పుకార్లు, అవాస్తవాలు మరియు తప్పుడు సమాచారం ఉంది. ఆస్త్‌మా అంటువ్యాధి అని కొంతమంది ప్రజలు అనుకుంటారు. ఇతరులు ఆస్త్‌మా ఒక మానసిక వ్యాధి మరియు అది కేవలం ఒక భావన అని అనుకుంటారు. ఆస్త్‌మా ప్రమాదకరమైనది కాదు మరియు ఆస్త్‌మా వలన ఎవ్వరూ మరణించరని కొందరి ఆలోచన. ఈ విభాగంలో వైద్య చదువులు మరియు వైజ్ఞానిక పరిశోధనల ఆధారంగా ఆస్త్‌మాకి సంబంధించిన కొన్ని అనుమానాలని మేము తీరుస్తాము.

అపోహ

ఇన్‌హేలర్లు ఎల్లప్పుడూ వాడితే అది ఒక అలవాటుగా మారి మీరు వాటికి బానిసగా మారతారు.
టాబ్లెట్లు మరియు సిరప్‌లు లాంటి నోటి ద్వారా చికిత్స, ఇన్‌హలేషన్ చికిత్స కన్నా మెరుగు
ఇన్‌హేలర్లు టాబ్లెట్లు/సిరప్‌లు కన్నా ఖరీదైనవి
ఇన్‌హేల్ చేసే మందులు/ ఇన్‌హేలర్లలో స్టిరాయిడ్స్ ఉన్నాయి కావున ఎక్కువ ఆస్త్‌మాకి వాడవచ్చును.
ఆస్త్‌మా వచ్చి పోతుంది. అది ఎల్లప్పుడూ ఉండదు.
ఆస్త్‌మా నయం అవుతుంది.
ఆస్త్‌మా ఉంటే మీరు సాధారణ జీవితం కొనసాగించలేరు
మీకు ఆస్త్‌మా ఉంటే ఆటలు అడలేరు మరియు వ్యాయామం చేయలేరు.
ఉత్తమమైన మరియు ప్రత్యామ్నాయ చికిత్సలు ఆస్త్‌మా నియంత్రణకి నాకు లాభదాయకం అవుతాయి.
ఆస్త్‌మా ఒకరి నుండి మరొకరికి రావచ్చును.
గర్భిణీ స్త్రీ ఇన్‌హేలర్లు వాడకూడదు
పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) చాలా ఖరీదైనది మరియు వాడటం కష్టం.
ఒకవేళ తల్లిదండ్రులికి ఆస్త్‌మా లేదంటే వారి పిల్లలికి వచ్చే ఆవకాశం తక్కువ.
మీరు ఆస్త్‌మా‍తో పెరగ వచ్చును లేదా మీకు వయసు పెరుగుతున్నప్పుడు ఆస్త్‌మా మెరుగు పడవచ్చును.
గాలి పీల్చుకోవటం కష్టమైనప్పుడు మీకు ఆస్త్‌మా వస్తుంది.
ఆస్త్‌మా అకస్మాత్తుగా వస్తుంది మరియు త్వరగా విషమిస్తుంది.
ఇన్‌హేల్ చేసే స్టిరాయిడ్స్ పెద్ద రోగులకి మాత్రమే మరియు చిన్న పిల్లలకి కాదు.
ఆస్త్‌మా లక్షణాలు అందరికీ ఒకేలా ఉంటాయి.
ఆస్త్‌మా వలన ఎవ్వరూ మరణించరు



అపోహ:

ఇన్‌హేలర్లు ఎల్లప్పుడూ వాడితే అది ఒక అలవాటుగా మారి మీరు వాటికి బానిసగా మారతారు.

వాస్తవం:
కాదు, ఇన్‌హేలర్లు మనకి అలవాటుగా మారవు. రోజూ మీ ఇన్‌హేలర్ మందు తీసుకున్నంత మాత్రాన్న దానికి మీరు బానిస కారు. మీరు రోజూ పళ్ళు తోముకోవడం అలవాటు అని మీరు అనుకుంటారా? లేదా పాలు తాగడం? లేదా రోజూ చేసే స్నానం అలవాటు అని మీరు అనుకుంటారా? అదే విధంగా, ఇన్‌హేలర్లు వాడటం అనేది ఒక మంచి అలవాటు అది మీ ఆస్త్‌మా నియంత్రణకి

అయినా కూడా మీరు రిలీవర్ మందు ఎక్కువగా తీసుకున్నట్లు అనిపిస్తుందా అంటే మీరు కంట్రోలర్‌ మందు సరిగ్గా తీసుకోవటం లేదని అర్థం. మీ డాక్టర్‌ని కలిసి, ఆయన మార్గదర్శకాన్ని తీసుకోవటం చాలా మంచిది.


అపోహ:

టాబ్లెట్లు మరియు సిరప్‌లు లాంటి నోటి ద్వారా చికిత్స, ఇన్‌హలేషన్ చికిత్స కన్నా మెరుగు

వాస్తవం:
కాదు, నోటి ద్వారా చికిత్స ఇన్‌హలేషన్ చికిత్స కన్నా మెరుగు కాదు మరియు దానిని నిరూపించడానికి సరిపడా పరిశోధన ఉంది. చాలా దేశాలలో, ఇన్‌హలేషన్ చికిత్స, నోటి ద్వారా చికిత్స స్థానంలో విజయం సాధించింది ఎందుకంటే అది చాలా ప్రభావంతమైంది, సురక్షితమైనది మరియు ఆస్త్‌మా నియంత్రణకి అతి తక్కువ ఖర్చుతో కూడిన సమర్ధవంతమైన మార్గం.

భారతదేశంలో చాలామంది రోగులు నోటి ద్వారా మందులు తీసుకోవడమే ఉత్తమమైంది మరియు ఏ వ్యాధికైనా అదే నిరూపించబడిన చికిత్సా విధానమని నమ్ముతారు. అయినా ఇన్‌హలేషన్ ద్వారా చికిత్స తీసుకోవడం ఉత్తమమైన మార్గమని వైజ్ఞానిక పరిశోధనలు తెలుపుతున్నాయి. నోటి ద్వారా చికిత్స అంటే నోటి ద్వారా తీసుకునే టాబ్లెట్లు లేదా సిరప్‌లు, పనిచేయడానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే అవి జీర్ణకోశం నుండి రక్త నాళాలకి వెళ్ళి మరియు చివరిగా ఊపిరితిత్తులకి చేరతాయి. ఇన్‌హలేషన్ చికిత్స చాలా త్వరితం అది ఊపిరితిత్తులకి నేరుగా చేరుతుంది.

ఎలాగైతే కంటికి ఇన్‌ఫెక్షన్ వస్తే మీరు చుక్కలు మీ కంటిలో వేసుకుంటారో, చర్మం గాయం అయిన చోట ఆయింట్‌మెంట్ రాసుకుంటారో, అదే విధంగా ఇన్‌హలేషన్ చికిత్స ఒక సులభమైన మార్గం, మందు ఊపిరితిత్తులలోకి సరాసరి చేరి, సమస్యను పరిష్కరిస్తుంది.

అంతేకాకుండా, నోటి ద్వారా చికిత్సలో, మందు మోతాదు మిల్లీ గ్రాములలో ఎక్కువ తీసుకోవటం వలన (ఇన్‌హలేషన్ చికిత్సలో కంటే 40 సార్లు ఎక్కువ) అంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయి. ఇన్‌హలేషన్ చికిత్సలో మందు మైక్రో గ్రాములలో అతి తక్కువ తీసుకోవటం వలన శరీరంలో ఏ భాగానికి చేరినా మీకు తక్కువ సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయి.


అపోహ:

ఇన్‌హేలర్లు టాబ్లెట్లు/సిరప్‌లు కన్నా ఖరీదైనవి

వాస్తవం:
కాదు ఇన్‌హలేషన్ చికిత్స, టాబ్లెట్లు మరియు సిరప్‌లు కన్నా ఖరీదు కాదు. నిజానికి, ఇన్‌హేలర్లు యొక్క ఒక రోజు ఖరీదు, టాబ్లెట్లు/సిరప్‌లు ఖరీదు కన్నా తక్కువ. భారతదేశంలో, ఇన్‌హేలర్లు అందరికీ అందుబాటులో ఉండే ప్రత్యేకమైన ధరలలో మరియు కొద్ది రూపాయలకే లభ్యమవుతాయి. కొన్ని నోటి ద్వారా మందులు, ఇన్‌హేలర్లు కన్నా ఖరీదైనవి. అంతేకాకుండా, టాబ్లెట్లు చేసిన హాని వలన దీర్ఘకాలంలో మీ ఆరోగ్యం కోసం ఎక్కువ ఖర్చు పెట్టవలసి ఉంటుంది.


అపోహ:

ఇన్‌హేల్ చేసే మందులు/ ఇన్‌హేలర్లలో స్టిరాయిడ్స్ ఉన్నాయి కావున ఎక్కువ ఆస్త్‌మాకి వాడవచ్చును.

వాస్తవం:
ఇన్‌హేల్ చేసే మందులు ఆస్త్‌మా ఎక్కువ ఉన్నవాళ్ళకి మాత్రమే కాదు. ఊపిరితిత్తులలో ఇన్ఫ్లమేషన్(వాపు) కలిగినప్పుడు వచ్చే పరిస్థితి ఆస్త్‌మా. ఇన్ఫ్లమేషన్కి స్టిరాయిడ్స్ తీసుకోవడం అనేది మెరుగైన చికిత్స, మరియు అది ఇన్‌హలేషన్ చికిత్స ద్వారా తీసుకోవటం చాలా ప్రభావంతమైన మార్గం. మీరు ఇన్‌హలేషన్ చికిత్స తీసుకున్నప్పుడు, స్టిరాయిడ్ మందు సరాసరి ఊపిరితిత్తులకి చేరుతుంది కనుక సైడ్ ఎఫెక్ట్లు తక్కువగా ఉంటాయి. ఇన్‌హేలర్లు ఎక్కువ ఆస్త్‌మా ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు. ఒక మోస్తరు ఆస్త్‌మా ఉన్నవాళ్ళకి కూడా సిఫారసు చేస్తారు.

See how parents are convinced that inhlation has minimum side effects

స్టిరాయిడ్స్ టాబ్లెట్ రూపంలో తీసుకుంటే మందు మోతాదు ఎక్కువగా ఉంటుంది (పోల్చి చూస్తే ప్రామాణిక స్టిరాయిడ్ ఇన్‌హేలర్ నుంచి తీసుకున్న ఒక్క పఫ్ కంటే ఒక స్టిరాయిడ్ మాత్ర 40 సార్లు మోతాదు ఎక్కువగా ఉంటుంది) మరియు ఒక ఊపిరితిత్తులలోనే కాకుండా ఎక్కువ శాతం శరీరం అంతటా కలుస్తుంది. క్రమం తప్పకుండా చాలా కాలం స్టిరాయిడ్స్ టాబ్లెట్లు వాడటం వలన బ్రిట్టిల్ బోన్స్(ఆస్టియోపోరోసిస్), బరువు పెరగడం, సులువుగా గాయం అవ్వడం, మధుమేహం, కాటరాక్ట్‌, గుండెలో మంట, అజీర్ణం లాంటి ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్‌లు, దిగులు కలిగించడం, లేదా మానసిక స్థితి మారడం, లేదా మీ మొహం గుండ్రంగా ఉబ్బవచ్చును (మూన్ ఫేస్).

మీ కంట్రోలర్‌లో ఉన్న స్టిరాయిడ్‌లో కోర్టికోస్టిరాయిడ్ ఉన్నది, అది సురక్షితమైనది. కోర్టికోస్టిరాయిడ్‌లు మన శరీరాలలో సహజంగా ఉత్పత్తి అయ్యే స్టిరాయిడ్స్‌ యొక్క నమూనాలు. కావున అది ఆస్త్‌మాకి సురక్షితమైన మరియు ప్రభావంతమైన చికిత్స. కొంతమంది ఆటగాళ్ళు మరియు బాడీ బిల్డర్లు స్టిరాయిడ్స్‌ని వాడి దుర్వినియోగం చేస్తారు. అవి ఇవి కావని మీరు అర్థం చేసుకోవాలి. అన్ని ఇన్‌హేలర్లలో స్టిరాయిడ్ ఉండదు, కొన్నింటిలో త్వరిత ఉపశమన మందు ఉంటుంది.

మీ పరిస్థితిని బట్టి, మీ డాక్టర్ స్టిరాయిడ్ మాత్రలు కొన్ని కొన్నిసార్లు ఇవ్వవచ్చును. ఒకవేళ స్వల్ప కాలం వరకు తీసుకుంటే, ప్రమాదకరమైన ప్రభావితాలు ఉండవు.


అపోహ:

ఆస్త్‌మా వచ్చి పోతుంది. అది ఎల్లప్పుడూ ఉండదు.

వాస్తవం:
ఛాతి దగ్గర బిగువు, ఊపిరి ఆడక పోవటం, దగ్గడం మరియు పిల్లికూతలు వంటి ఆస్త్‌మా యొక్క లక్షణాలు వచ్చి, పోయినా ఆస్త్‌మా ఎల్లప్పుడూ ఉంటుంది. ఆస్త్‌మా వచ్చిపోతుంది మరియు లక్షణాలు కనబడినపుడు మాత్రమే ఎవరైనా మందులు వాడాలి అనే సామాన్యమైన అపోహ ఉంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఆస్త్‌మా అనేది దీర్ఘవ్యాధి, దాని లక్షణాలు (ఎక్కువ కాలం) కనబడక పోయినా సరే రోగి ఎప్పుడూ మందులు వేసుకుని చికిత్స చేయించుకోవాలి.

ఊపిరితిత్తుల వాయునాళాలలో వాపు ఆస్త్‌మా రావడానికి గల కారణం, ఒకవేళ లక్షణాలు కనబడటం లేదని మీరు మందులు తీసుకోవటం ఆపేస్తే, మీకు మీరు ఎంతో హాని కలిపించుకున్నవారు అవుతారు మరియు ఎటాక్ వచ్చినప్పుడు మీరు కోలుకోవడానికి చాలాకాలం పడుతుంది.


అపోహ:

ఆస్త్‌మా నయం అవుతుంది.

వాస్తవం:
వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందినా, దురదృష్టవశాత్తు ఆస్త్‌మాని పూర్తిగా నయం చేయలేదు. హోమియోపతి లేదా ఆయుర్వేదం లేదా చేప చికిత్స లేదా యోగ ఇవన్నీ కూడా ఆస్త్‌మాని నయం చేయలేవు.

అయినా ఆలోపతిలో, దీనికి చికిత్స చేయవచ్చును మరియు అత్యుత్తమైన నియంత్రణలో ఉండేటట్లు చేయవచ్చును. ఏంతోమంది విజయం సాధించిన సినీ తారలు, ఆటగాళ్ళు మరియు ఉద్యోగస్తులకి ఆస్త్‌మా ఉన్నా, వారు అనుకున్నది సాధించడానికి వారిని అది ఆపలేదు. కావున ఒకవేళ మీకు ఆస్త్‌మా ఉంటే మీరు సాధించాలని అనుకున్న పనిని అది మిమ్మల్ని ఆపనివ్వకుండా చేయండి. క్రమం తప్పకుండా చికిత్స తీసుకుంటే పూర్తి ఆస్త్‌మా నియంత్రణ సాధ్యపడవచ్చును. మీకు ఆస్త్‌మా లక్షణాలు ఎక్కువగా కనబడక పోయినా ఆస్త్‌మా పూర్తిగా పోయింది అని అనుకోకండి.


అపోహ:

ఆస్త్‌మా ఉంటే మీరు సాధారణ జీవితం కొనసాగించలేరు

వాస్తవం:
మీకు ఆస్త్‌మా ఉన్నా ఉత్తేజవంతమైన మరియు ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించవచ్చును. ఒకవేళ మీకు ఆస్త్‌మా ఉన్నా లేక మీ బిడ్డకి ఉన్నా, మీరు సాధారణమైన జీవితం కొనసాగించవచ్చును అని మీకు హామీ ఇవ్వగలము. మీరు, మీ బిడ్డ, డాక్టర్ సలహాని పాటించండి, ఆస్త్‌మా గురించి చదివి తెలుసుకోండి, డాక్టర్ ఇచ్చిన ఇన్‌హేల్ చేసే మందులు సరిగ్గా వాడండి, మరియు ట్రిగ్గర్స్‌ని అధిగమించండి, మీ కలల మార్గంలో మరియు మీ జీవితానికి ఆస్త్‌మా అడ్డు రావడానికి ఏ కారణం లేదు. ఎంతోమంది విజయం సాధించిన మగవాళ్ళు మరియు ఆడవాళ్ళు - సినీ తారలు, రాజకీయవేత్తలు, వ్యాపారులు, డాక్టర్లు, క్రికెట్ ఆడేవాళ్ళు, ఒలంపిక్ బంగారు పతకాలు గెలిచినవారు వీరందరికీ ఆస్త్‌మా ఉంది అయినా ఉత్తేజవంతమైన మరియు ఆరోగ్యవంతమైన జీవితాలని కొనసాగిస్తున్నారు.


అపోహ:

మీకు ఆస్త్‌మా ఉంటే ఆటలు అడలేరు మరియు వ్యాయామం చేయలేరు.

వాస్తవం:
ఒకవేళ మీకు ఆస్త్‌మా ఉన్నా మీరు ఆటలు ఆడవచ్చును మరియు వ్యాయామం చేయవచ్చును, కాని మీరు మీ మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఆస్త్‌మాకి ఈత చాలా మంచిది. ఇంకొక వైపు, పొడి మరియు చల్ల గాలిలో వ్యాయామం కొంతమందికి ట్రిగ్గర్. మీరు మీ డాక్టర్ ఇచ్చిన, కంట్రోలర్‌ మందులు క్రమం తప్పకుండా తీసుకోవటం చాలా ముఖ్యము. కొంతమంది ఆస్త్‌మా ఉన్నవాళ్ళు వ్యాయామం చేసే ముందు రిలీవర్ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది కావున ఎప్పుడూ మీ రిలీవర్ మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ అవసరమైతే అదనపు మందులు మీతో తీసుకు వెళ్ళడం మరచిపోకండి. మీకు ఒకవేళ ఎటాక్ వస్తే మీ బృందం సభ్యులకి, మీ స్నేహితులకి, మీ జిమ్ అధ్యక్షుడికి లేదా మీకు శిక్షణ ఇచ్చేవారికి ఏమి చేయాలో తెలియజేయండి.

ఆస్త్‌మాకి యోగ, మరియు ఈత మరియు స్ప్రింటింగ్ వంటి ఆటలు మంచివి, ఎందుకంటే వాటిలో ఆగకుండా పరుగెత్తడం ఉండదు మరియు మధ్యలో మీరు విరామం తీసుకోవచ్చు. వ్యాయామం మరియు ఆటలు ఆడాలని మీరు ఖచ్చితంగా అనుకుంటే, దయచేసి మీ డాక్టర్ని క్రమం తప్పకుండా సంప్రదించండి.

ఆస్త్‌మాని మీ కలలకి అడ్డు రానివ్వకండి. జీవితంలో లేదా ఆటలలో గెలవడానికి అది మీకు అడ్డుగోడ కాదు. పెద్ద క్రికెట్ ఆటగాళ్ళకి, బాస్కెట్ బాల్ ఆటగాళ్ళకి, ఈతగాళ్ళకి ఆస్త్‌మా ఉంది మరియు ఒలంపిక్ బంగారు పతకాలు గెలిచిన చాలామందికి ఆస్త్‌మా ఉంది అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.


అపోహ:

ఉత్తమమైన మరియు ప్రత్యామ్నాయ చికిత్సలు ఆస్త్‌మా నియంత్రణకి నాకు లాభదాయకం అవుతాయి.

వాస్తవం:
హోమియోపతి, ఆయుర్వేదం, మూలికల చికిత్స, ఆక్యుపంచర్ మరియు చేప చికిత్స, వంటి ఉత్తమమైన/ప్రత్యామ్నాయ చికిత్సలు ఏవీ ఆస్త్‌మా నియంత్రణలో లాభదాయకం కావు. వాటి సామర్థ్యం నిరూపించే డేటా ఎదీ లేదు. ఈ చికిత్సలు ఆస్త్‌మా నియంత్రణకి ఏ మాత్రం సహాయపడలేదని పరిశోధనలు చెపుతున్నాయి. అదేకాకుండా, వాటి భద్రత గురించి సమాచారం లేదు, సైడ్ ఎఫెక్ట్‌లు పరంగా కొంతమంది రోగులకి అపాయం చేకూరుస్తాయి.

ఆస్త్‌మా ఎటాక్ వచ్చినప్పుడు ఉత్తమమైన మందులు సహాయపడవని దయచేసి గమనించండి. ఇన్‌హలేషన్ చికిత్సకి అవి బదులు కాదు. ఒకవేళ మీరు ఈ చికిత్సలలో ఏదో ఒకదానిని ప్రయత్నించాలి అని అనుకున్నా, మీ ప్రధానమైన చికిత్సని ఆపివేయకండి. ముందుగా ఉత్తమమైన చికిత్స గురించి డాక్టర్తో చర్చించండి మరియు ముందుకు వెళ్ళే ముందు ఆయన సలహా తీసుకోండి.

ప్రత్యామ్నాయ మందులు వాడి లాభం లేక ఆస్త్‌మా ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఎలా ఇన్‌హలేషన్‌కి మారిపోయారో చూడండి.



అపోహ:

ఆస్త్‌మా ఒకరి నుండి మరొకరికి రావచ్చును.

వాస్తవం:
కాదు, ఆస్త్‌మా అంటువ్యాధి కాదు. ఆస్త్‌మా ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చేది కాదు, మరియు ఇంటి దగ్గర లేదా ఉద్యోగం చేసే చోట ఎవ్వరికీ అంటుకోదు.


అపోహ:

గర్భిణీ స్త్రీ ఇన్‌హేలర్లు వాడకూడదు

వాస్తవం:
ఒక శిశువు ఆస్త్‌మా ఇన్హేలర్‍ తీసుకుంటున్నప్పుడు, గర్భిణీ స్త్రీ కూడా తీసుకోవచ్చును. వాస్తవానికి, గర్భిణీ స్త్రీ ఆరోగ్యవంతమైన శిశువును జన్మించడానికి క్రమం తప్పకుండా ఆస్త్‌మా ఇన్‌హేలర్లు తీసుకోవాలి. ఇప్పటి ఇన్‌హేలర్లు చాలా సురక్షితమైనవి, చనుపాలు ఇచ్చే తల్లులు కూడా ఇన్‌హేలర్లు తీసుకోవచ్చును, అవి శిశువుకి హాని కలిగించవు. ఎందుకంటే మందు మోతాదు, టాబ్లెట్ల కన్నా 40 సార్లు తక్కువగా ఉంటుంది.



అపోహ:

పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) చాలా ఖరీదైనది మరియు వాడటం కష్టం.

వాస్తవం:
ఎలాగైతే రక్తపోటుని కొలవటానికి BP కొలిచే పరికరం ఉంది మరియు మధుమేహం తనిఖీ చేయడానికి గ్లూకోమీటర్, పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) ఆస్త్‌మాకి థర్మామీటర్ అని అనుకోండి. అది ఒక చిన్న చేతి పరికరం, దాని ఖరీదు ఎక్కువ కాదు, వాడేవారికి అనుకూలంగా ఉండి, దాని పరిరక్షణ మరియు వాడుక సులభం. మీ ఆస్త్‌మా నియంత్రణలో ఉంచడానికి ఆస్త్‌మా ఎటాక్ని ముందుగానే తెలుసుకోవడానికి మరియు నివారించడానికి వారానికి రెండుసార్లు వాడాలని సిఫారసు చేయబడినది. ఒకవేళ మీకు ఆస్త్‌మా ఉంటే మరియు మీ ఊపిరితిత్తుల యొక్క పనితనాన్ని పీక్ ఫ్లో మీటర్‍‍తో (బ్రీతోమీటర్) తనిఖీ చేస్తునప్పుడు మీకు రీడింగ్ తగ్గుతున్నట్లు అనిపిస్తే మీ ఆస్త్‌మా సరిగ్గా నియంత్రించబడలేదని అర్థం మరియు మీకు స్వల్పకాలంలో లేదా కొద్ది రోజులలో ఆస్త్‌మా ఎటాక్ రావచ్చును. మీ మందు మోతాదు ఎక్కువ చేయడానికి లేదా ఎక్కువ సార్లు మీ మందు తీసుకోవడానికి ఇది ఒక ముందు హెచ్చరిక సంకేతం. మీ పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) రీడింగ్ మామూలుగా ఉంటే, మీ ఆస్త్‌మా నియంత్రణలో ఉన్నట్లు అర్థం.


అపోహ:

ఒకవేళ తల్లిదండ్రులికి ఆస్త్‌మా లేదంటే వారి పిల్లలికి వచ్చే ఆవకాశం తక్కువ.

వాస్తవం:
మీ కుటుంబంలో ఎవరికైనా అంటే తల్లిదండ్రులకే కాకుండా, మీ అక్కాతమ్ముళ్ళకి, అమ్మమ్మ తాతయ్యలకి, మీ కుటుంబ సభ్యులైన అత్తయ్యలు మరియు మామయ్యలకి అలర్జీ ఉంటే మీకు వచ్చే ఆవకాశం ఉంది. మరియు ట్రిగ్గర్స్ మీకు ఎటాక్ కలిగించవచ్చు.


అపోహ:

మీరు ఆస్త్‌మా‍తో పెరగ వచ్చును లేదా మీకు వయసు పెరుగుతున్నప్పుడు ఆస్త్‌మా మెరుగు పడవచ్చును.

వాస్తవం:
ఆస్త్‌మా అనేది జీవిత కాలం ఉండే పరిస్థితి. కాల క్రమేణా ఒక శిశువు యొక్క ఆస్త్‌మా మెరుగు పడవచ్చును లేదా క్షీణించవచ్చును మరియు కొతమంది ఆస్త్‌మా ఉన్న పసిపిల్లలలో వారి పెరుగుతున్న కొలదీ (మరియు వారి ఊపిరితిత్తులు పెరుగుతున్న కొలదీ) పరిస్థితి బాగా మెరుగుపడవచ్చును, కాని కొంతమందిలో, ఆస్త్‌మా వారి జీవితాంతం ఉంటుంది.


అపోహ:

గాలి పీల్చుకోవటం కష్టమైనప్పుడు మీకు ఆస్త్‌మా వస్తుంది.

వాస్తవం:
ఆస్త్‌మా ఉన్న వారికి అది ఎల్లప్పుడూ ఉంటుంది. అది ఒక దీర్ఘ (సుదీర్ఘకాలం)స్థితి మరియు మీకు ఎక్కువ లక్షణాలు కనబడకపోయినా వాయునాళానికి ఇన్ఫ్లమేషన్(వాపు) ఎప్పుడూ ఉండవచ్చును. ఒకవేళ చికిత్స తీసుకోకపొతే, వాయునాళాలలో వాపు వలన, ఊపిరితిత్తుల యొక్క శక్తి దీర్ఘకాలంలో తగ్గిపోతుందని వైద్య నిదర్శనం ఉంది. మీ ఆస్త్‌మాని నియంత్రణలో ఉంచడానికి నిరంతరం కంట్రోలర్‌ మందులు తీసుకోవాలి మరియు ఆస్త్‌మా ట్రిగ్గర్స్‌ని తప్పించుకోవాలి.


అపోహ:

ఆస్త్‌మా అకస్మాత్తుగా వస్తుంది మరియు త్వరగా విషమిస్తుంది.

వాస్తవం:
చాలా వరకు ఆస్త్‌మా ఎటాక్లు నెమ్మదిగా మొదలవుతాయి - మామూలుగా ఒక రోజూ కన్నా ఎక్కువ ఆరోగ్యం బాగుండకపోవటం, ఉదాహరణకి.. కొద్దిగా ఊపిరాడక పోవడం లేదా ఎటాక్ వచ్చే ముందు పిల్లికూతలు రావచ్చు. కావున ఛాతిలోని కదలికల్నిజాగ్రత్తగా గమనించండి, మీ లక్షణాలని గుర్తించి తెలుసుకోండి (ఛాతిలోని బిగువుని, ఊపిరాడక పోవడం, దగ్గడం మరియు వీజింగ్) అవసరమైతే మీ ఆస్త్‌మా గురించి రోజూ డైరీ వ్రాయండి, మరియు మీ ట్రిగ్గర్స్‌కి దూరంగా ఉండండి.

మీరు సాధారణమైన, చేతిలో పట్టుకునే వాడే పీక్ ఫ్లో మీటర్‌ని (బ్రీతోమీటర్) వాడాలని గుర్తుపెట్టుకోండి. అది మీకు ముందే సంకేతాలని ఇచ్చి మరియు
ఆస్త్‌మా ఎటాక్ని నివారించడానికి సహాయపడుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కువ ఆస్త్‌మా లక్షణాలు లేకపోతే పూర్తిగా మీకు ఆస్త్‌మా తగ్గినట్లు కాదు.


అపోహ:

ఇన్‌హేల్ చేసే స్టిరాయిడ్స్ పెద్ద రోగులకి మాత్రమే మరియు చిన్న పిల్లలకి కాదు.

వాస్తవం:
నిరంతరం ఆస్త్‌మా ఉన్న పిల్లలకి మరియు పెద్దలకి ఇన్‌హేల్ చేసే స్టిరాయిడ్స్ తీసుకోమని సిఫారసు చేస్తారు. మోస్తారు లేదా ఎప్పుడూ ఎక్కువ ఆస్త్‌మా ఉన్న పిల్లలకి ఇన్‌హేల్ చేసే స్టిరాయిడ్స్, తక్కువ మోతాదులో సిఫారసు చేస్తారు. ఇన్‌హేల్ చేసినప్పుడు, మందు మోతాదు, టాబ్లెట్లు మరియు సిరప్‌లు కన్నా 40 రెట్లు తక్కువగా ఉంటాయి. మరియు అది చేరవలసిన శరీర భాగానికి అంటే ఊపిరితిత్తులకి చేరుతుంది కాబట్టి, సైడ్ ఎఫెక్ట్‌లు చాలా తక్కువగా ఉండి, హానిచేయవు.


అపోహ:

ఆస్త్‌మా లక్షణాలు అందరికీ ఒకేలా ఉంటాయి.

వాస్తవం:
ఆస్త్‌మా ఒక్కొక్కరిలో వేరు వేరుగా ప్రభావం చూపుతుంది. పిల్లికూతలు, ఛాతి బిగువు మరియు అలసట వంటి లక్షణాలు ఒక వ్యక్తిలో కనిపిస్తే ఇంకొకరికి దగ్గు మాత్రమే ఉండవచ్చును. మీకు మీ లక్షణాలు ఏమిటో తెలిస్తే మీకు వెంటనే సహాయం అందవచ్చును.


అపోహ:

ఆస్త్‌మా వలన ఎవ్వరూ మరణించరు

వాస్తవం:
దురదృష్టవశాత్తు, ఆస్త్‌మా వలన ఎవరైనా చనిపోవచ్చును. WHO అప్డేట్ ప్రకారం, ప్రతీ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఆస్త్‌మా వలన 2,50,000 మృతులు లెక్కించబడినవి.

ముందుగానే ఆస్త్‌మా కనిపెట్టకపోతే మరణించే అవకాశాలు ఉన్నాయి. లేదా ఎటాక్ వచ్చినపుడు రోగి దగ్గర రిలీవర్ లేకపోతే మరణించే అవకాశాలు ఉన్నాయి.

ఎక్కువ మోతాదులో బ్రాన్కోడైలేటర్ ఇన్హేలర్ని తీసుకుంటున్నవారు (రోజుకి పది పఫ్లు కంటే ఎక్కువ తీసుకుంటే, లేదా నెలకి రెండు కన్నా ఎక్కువ ఇన్‌హేలర్లు కావలసివస్తే), ఆస్త్‌మా నియంత్రణలో లేదు అని వారికి మరణానికి దారితీసే ప్రమాదమున్నదని, దీని బట్టి తెలుస్తుంది. ఎవరైతే తరుచుగా నేబులైజేషన్ కోసం ఎక్కువ సార్లు ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తే వాళ్ళు ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఆస్త్‌మా అన్ని వయసుల వారికి మరియు సంఘంలో ఉన్న అన్నిరకాల వారికి రావచ్చును, మరియు అది ప్రమాదకరమైనా, చాలా వరకు నియంత్రించవచ్చును. ఆస్త్‌మా వలన మరణాలని చాలా వరకు నివారించవచ్చును. కావున దయచేసి మీ యొక్క మరియు మీ బిడ్డ యొక్క ఆస్త్‌మా యొక్క నిర్వాహణని జాగ్రత్తగా చేయండి.