Home | బ్రీత్ఫ్రీ గురించి | Cipla గురించి | మీడియా రూమ్ | సైన్ అప్ | దిగుమతులు | శోధించు
  Breathe Free
ఇది దగ్గా లేదా
ఆస్త్‌మానా?
చికిత్స మరియు నియంత్రణ
FAQ & మద్దతు
అలర్జిక్ రైనైటిస్
COPD
 
పిల్లల ట్రిగ్గర్లు తరచుగా అడిగే ప్రశ్నలు ఆస్త్‌మా పిల్లల కథలు పిల్లల ఇన్‌హేలర్లు
 

పిల్లల్లో ఆస్త్‌మా

Important Points to Remember

తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డ ఆనందమైన, ఆరోగ్యమైన మరియు చురుకైన బాల్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు. ఒకవేళ మీ బిడ్డకు ఆస్త్‌మా ఉంటే, అప్పుడు కూడా మీరు అలాగే ఆశించవచ్చు. ఎందుకంటే సరైన చికిత్సతో ఆస్త్‌మాని పూర్తిగా నియంత్రించవచ్చు. కాబట్టి దయచేసి మీ బిడ్డకు ఆస్త్‌మా ఉంటే చింతించకండి. మా “ఆస్త్‌మా పార్ విజయ్” సినిమాను క్లిక్ చేయండి చాలు. ఆస్త్‌మా ఉండే పిల్లలు సాధారణ పిల్లల్లాగే అన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారో చూడండి. మీ బిడ్డ కూడా అన్నీ చేయగలడని మీరు తెలుసుకుంటారు. అవును, క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్లడం, ఐస్ క్రీమ్ తినడం మరియు చురుకుగా ఆటలు ఆడటం.

పిల్లల్లో ఆస్త్‌మా పెద్దల ఆస్త్‌మా కంటే వేరుగా ఉంటుంది. పిల్లల్లో ఆస్త్‌మా యొక్క ప్రత్యేకమైన లక్షణాలైన – శ్వాస తీసుకోలేకపోవడం, గురక పెట్టడం, దగ్గడం మరియు ఛాతి పట్టేయడం వంటివి కనిపించవు. అంతే కాకుండా ప్రతి పిల్లవాని ఆస్త్‌మా వేరుగా ఉంటుంది. కొంతమంది పిల్లల్లో ఆస్త్‌మా పరిమిత స్థాయిలో ఉంటే మరికొంతమంది పిల్లల్లో ఆస్త్‌మా తీవ్రస్థాయిలో ఉంటుంది. కొందరు తరచుగా దగ్గు మరియు కొన్ని రకాల అలర్జీలకు గురవుతుంటారు.

ఆస్త్‌మా అనేది పిల్లల్లో చాలా సాధారణమైన దీర్ఘ (సుదీర్ఘ కాలం) వ్యాధి. యుకెలో ప్రతి 11 మంది పిల్లల్లో ఒకరికి ఆస్త్‌మా ఉంది. యుఎస్ఎలో 7 మిలియన్ల మంది పిల్లలకు ఆస్త్‌మా ఉంది. భారతదేశంలో ప్రతి 12 మంది పిల్లల్లో ఒకరికి ఆస్త్‌మా ఉంది. కాబట్టి, మీ బిడ్డకు ఆస్త్‌మా ఉందని వ్యాధి నిర్ధారణ అయితే, చింతించకండి. మీరు ఒంటరి కాదు.

అయినప్పటికీ, తమ పిల్లల భవిష్యత్తుపై ఆస్త్‌మా ఒక సామాజిక కళంకంగా తల్లిదండ్రులు చింతిస్తుంటారు. కాబట్టి ఇంగ్లీష్ వైద్యుడు మీ బిడ్డకు ఆస్త్‌మా ఉందని వ్యాధి నిర్ధారణ చేస్తే, ఇంగ్లీష్ వైద్యం దుష్ప్రభావాలు మరియు దీర్ఘకాలిక చికిత్సను దృష్టిలో పెట్టుకుని, వారు మరొక అభిప్రాయాన్ని తీసుకోమని మరియు దానికి బదులుగా మరొక చికిత్సను తీసుకోమని సూచిస్తారు. అయితే ఇవన్నీ ఆస్త్‌మా గురించి సందేహాలు మాత్రమే. మీరు చదివేటప్పుడు, మీ సందేహాలకు సమాధానాలతోపాటు మీ బిడ్డ ఆస్త్‌మాని నియంత్రించడంలో ఎలా సహాయపడాలో కూడా తెలుసుకుంటారు.
  ©2010 బ్రీత్ ఫ్రీ, సర్వ హక్కులూ ప్రత్యేకం.