మీ బిడ్డకు ఆస్త్‌మా ఉంటే, మీరు సరైన చోటుకే వచ్చారు. ఇక్కడ మీ బిడ్డ ఆస్త్‌మా గురించి మీరు మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మరియు ఆస్త్‌మా ఉన్నప్పటికీ మీ బిడ్డ ఆనందమైన, ఆరోగ్యమైన మరియు చురుకైన జీవితాన్ని కలిగి ఉండగలరని తెలుసుకుంటారు. అవును, సాధారణ పిల్లలు చేసే ప్రతిదాన్ని మీ బిడ్డ కూడా చేయగలడు – క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్లడం, ఐస్ క్రీమ్ తినడం మరియు చురుకైన ఆటలను ఆడటం కూడా. ఎందుకంటే సరైన చికిత్సతో ఆస్త్‌మాని పూర్తిగా నియంత్రించవచ్చు. కాబట్టి దయచేసి మీ బిడ్డకు ఆస్త్‌మా ఉంటే చింతించకండి. మా “ఆస్త్‌మా పార్ విజయ్” సినిమాను క్లిక్ చేసి, తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు కలిసి ఆస్త్‌మాపై ఎలా విజయం సాధించారో చూడండి.
| మా బిడ్డ దగ్గు ఆస్త్‌మాకు కారణం అవుతుందా? |
|
దగ్గు అనేది ఆస్త్‌మా ఉండే పిల్లల్లో కనిపించే చాలా సాధారణమైన లక్షణం. ఇది శ్వాసక్రియ ప్రక్రియలో శ్లేష్మం, ఇబ్బంది కలిగించే చెడు పదార్థాలు మరియు సంక్రమణలను తొలగించేందుకు జరిగే ప్రయత్నం. పిల్లల్లో దగ్గు ఆపదను తేవచ్చు మరియు మీ బిడ్డ నిద్ర, చదువుపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపవచ్చు మరియు చాలా ముఖ్యంగా బాల్యంలో అనుభవించాల్సిన చిన్న ఆనందాలను ఇది దూరం చేయవచ్చు.
ఎక్కువ ఆస్త్‌మా ఉన్న పిల్లలు శ్వాస తీసుకోలేకపోవడం కంటే గురకకు ముందు వచ్చే దగ్గు లక్షణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఏమైనప్పటికీ, పిల్లలందరిలో ఆస్త్‌మా లక్షణాలు ఒకేలా ఉండవు. ఒక పిల్లవాడిలో గురక పెట్టడం, ఛాతి పట్టేయడం మరియు ఆయాసం వంటి పలు లక్షణాలు ఉండవచ్చు, అదే సమయంలో మరొక పిల్లవాడికి దగ్గు మాత్రమే ఉండి, శ్వాస తీసుకోలేకపోవడం ఉండకపోవచ్చు.
మళ్లీ మళ్లీ దగ్గు మరియు నిరంతరంగా గురక పెట్టడం ఉంటే, అది తీవ్రమైన ఆస్త్‌మాకి గుర్తు. ఏమైనప్పటికీ, దగ్గు చాలా ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. చాలా మంది పిల్లలు సాధారణ జలుబు వంటి వైరల్ శ్వాసక్రియ ప్రక్రియ సంక్రమణ మూలంగా ఎక్కువగా మరియు మళ్లీ మళ్లీ వచ్చే దగ్గు (వారం లేదా రెండు వారాలకు)తో బాధపడుతుంటారు.
దీర్ఘకాలిక దగ్గు (అంటే 3 – 4 వారాలు ఉండేది) ఆస్త్‌మాని సూచిస్తుంది కాబట్టి ఆందోళనకు కారణం కావచ్చు. ఆస్త్‌మాకి సంబంధించిన దగ్గు సాధారణంగా ఈ క్రింది విధంగా ఉంటుంది:
• పునరావృత దగ్గు
• నిరంతర దగ్గు
• జ్వరం లేకుండా సాధారణంగా వచ్చే దగ్గు
• రాత్రి వేళల్లో ఎక్కువయ్యే దగ్గు మరియు
• శారీరక చర్యలతో ఎక్కువయ్యే దగ్గు
దురదృష్టవశాత్తూ, చాలా సందర్భాల్లో, అంతర్లీనంగా ఉండే కారణం కోసం శోధించకుండా దగ్గు నిరోధకాలు మరియు యాంటీ బయాటిక్‌లతో దగ్గుకు చికిత్స చేయబడుతుంది. ఆస్త్‌మాకి సరైన చికిత్స సరైన సమయంలో అందించకపోతే, పిల్లల్లో అది నయం చేయడానికి సాధ్యంకాని విధంగా ఊపిరితిత్తులు పాడయ్యేందుకు కారణం అవుతుంది. దయచేసి మీ డాక్టర్‌ని వెంటనే సంప్రదించి, వంశపారంపర్యంగా ఆస్త్‌మా వస్తుంది కాబట్టి, మీ కుటుంబ చరిత్ర గురించి తెలియజేయండి.
దగ్గు ఆస్త్‌మా వల్ల వస్తోందా లేదా ఏదైనా ఇతర కారణాల మూలంగా వస్తోందా అని మీ డాక్టర్ వ్యాధి నిర్ధారణ చేయగలరు. మీ బిడ్డ ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు అయితే, పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) సిఫారసు చేయబడుతుంది. దయచేసి మీ బిడ్డ యొక్క ట్రిగ్గర్స్‌ను గమనించండి.
| నా బిడ్డలో గమనించవలసిన ఆస్త్‌మా లక్షణాలు ఏమిటి? |
|
ఆస్త్‌మా యొక్క సాధారణ లక్షణాలు:
దగ్గడం: ఎప్పటికీ ఆగని మరియు వ్యాయామం తర్వాత, రాత్రి వేళల్లో ఆడుకోవడం తర్వాత మరింత ఎక్కువయ్యే దగ్గు.
గురక పెట్టడం: సాధారణంగా వెలుపలికి శ్వాస వదిలే సమయంలో వినిపించే ఊల వంటి ధ్వని.
శ్వాసను తక్కువగా తీసుకోవడం: శ్వాస తీసుకోలేకపోవడం, అంటే మీ ఊపిరితిత్తుల లోపల లేదా వెలుపల కావలసినంత గాలిని పొందలేకపోవడం. వెలుపలికి శ్వాస వదలడం చాలా కష్టం కావడం.
ఛాతి పట్టేయడం: ఎవరో పిండుతున్నట్లు లేదా కూర్చున్న విధంగా, ఛాతిలో నలుపుతున్నట్లు ఉండటం.
ఇతర లక్షణాలు:
రాత్రి వేళల్లో దగ్గు వల్ల వ్యాకుల నిద్ర.
వ్యాయామం చేసేటప్పుడు శ్వాస తీసుకోలేకపోవడం.
దయచేసి గమనించండి: ఆస్త్‌మా లక్షణాలు పిల్లల్లో వేర్వేరుగా ఉంటాయి. కొందరిలో దగ్గు లేదా గురక పెట్టడం మాత్రమే ఉండగా కొందరిలో అన్ని లక్షణాలు ఉండవచ్చు. చాలా తరచుగా, దగ్గు కేవలం దగ్గుగానే చికిత్స చేయబడుతుంది, అయితే తరచుగా వస్తూ పోతూ ఉండే దగ్గు ఆస్త్‌మాకి అంతర్లీనంగా ఉండే కారణం కావచ్చు. ఇంకా, ఆస్త్‌మా పొరపాటుగా “వీజింగ్ బ్రాంకైటిస్” లేదా “అలర్జిక్ బ్రాంకైటిస్”గా పిలవబడుతోంది. చికిత్స అందిస్తున్నప్పటికీ మీ బిడ్డ యొక్క దగ్గు మరియు లక్షణాలు తగ్గలేదని మీరు భావిస్తే, మీ డాక్టర్‌తో ఆస్త్‌మా గురించి చర్చించండి మరియు మీ బిడ్డ మరియు మీ కుటుంబం యొక్క చరిత్రను డాక్టర్‌తో సరిగ్గా చెప్పండి. మీ బిడ్డకు సరైన చికిత్సను వేగంగా అందించడంలో ఇది సహాయపడుతుంది.
| నా బిడ్డకు ఆస్త్‌మా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది? |
|
ఛాతి నలుపుతున్నట్లు ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు మరియు గురకతో అతను లేదా ఆమె బాధపడుతున్నట్లయితే మీ బిడ్డకు ఆస్త్‌మా ఉండవచ్చు. వీటిని ఆస్త్‌మా లక్షణాలు అంటారు. మీ బిడ్డ వ్యాధి బారిన పడినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు లేదా పెంపుడు జంతువుతో ఆటలాడేటప్పుడు లేదా అతను లేదా ఆమె సరిపడని ఆహారాన్ని తీసుకున్నప్పుడు ఈ లక్షణాలు మరింత ఎక్కువ కావడం మీరు గమనించవచ్చు. వీటిని ట్రిగ్గర్స్ అంటారు. డాక్టర్‌కి సరిగ్గా వివరించగలిగేందుకు మీ బిడ్డ లక్షణాలను గమనిస్తూ ఉండండి. మీ బిడ్డను పరీక్షించేటప్పుడు, మీ బిడ్డకు కొన్ని వైద్య పరీక్షలను కూడా వైద్యుడు సూచించవచ్చు. 6 సంవత్సరాలు నిండిన మరియు అంతకంటే పెద్ద పిల్లలకు పీక్ ఫ్లో మీటర్
(బ్రీతోమీటర్) పరీక్ష సిఫారసు చేయబడింది.
ఆస్త్‌మా అంటే వాయునాళాలు – మీ ఊపిరితిత్తుల లోపలికి మరియు వెలుపలికి గాలిని తీసుకెళ్లే నాళాలు – వాయడం వల్ల వచ్చే దీర్ఘ (సుదీర్ఘ కాలం) వ్యాధి. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో చాలా చిన్న నాళాలు ఉంటాయి, దీని వల్ల వారిలో ఆస్త్‌మా చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆస్త్‌మా ఉన్న పిల్లలు ప్రత్యేకించి ఉదయం మరియు రాత్రి వేళల్లో ఛాతి నలుపుతున్నట్లు ఉండటం, శ్వాస తీసుకోలేకపోవడం, దగ్గు మరియు గురక వంటి సమస్యలను అనుభవిస్తారు. గురక అంటే మీ బిడ్డ గాలిని లోపలికి తీసుకున్నప్పుడు మరియు బయటకు వదిలినప్పుడు వినిపించే ఊల వంటి ధ్వని.
Click here to see what happens in asthma.
| ఆస్త్‌మాలో ట్రిగ్గర్స్ అంటే ఏమిటి? |
|
ట్రిగ్గర్స్ అంటే మీ బిడ్డపై ఆస్త్‌మా దాడిని ప్రారంభించే లేదా ఆస్త్‌మాని మరింత ఎక్కువ చేసే విషయాలు.
ట్రిగ్గర్స్ ప్రతిచోటా ఉంటాయి. మీ ఇల్లు, స్కూలు, ఆట స్థలం అంతటా ట్రిగ్గర్స్ ఉండవచ్చు.
మీ బిడ్డకు కొన్ని సాధారణ ఆస్త్‌మా ట్రిగ్గర్స్:
• దుమ్ము మరియు పొగ
• మొక్కల నుండి పూల పుప్పొడి
• స్కూల్లో చాక్పీస్ దుమ్ము
• వాతావరణంలో మార్పు
• నవ్వడం మరియు ఏడవడం వంటి భావోద్వేగాలు
• బొచ్చు జంతువుల వెంట్రుకలు మరియు పక్షుల ఈకలు
• శారీరక శ్రమ మరియు వ్యాయామం
మీ బిడ్డకు కేవలం ఒకే ట్రిగ్గర్ ఉండవచ్చు లేదా ట్రిగ్గర్స్‌గా పని చేసే చాలా విషయాలను మీరు కనుగొనవచ్చు. ఒకసారి మీ బిడ్డ ఆస్త్‌మాని ఏది ట్రిగ్గర్ చేస్తుందో మీరు తెలుసుకున్నాక, ఈ ట్రిగ్గర్స్‌ను నియంత్రించేందుకు చర్యలను తీసుకోవడం ముఖ్యం.
మీ ఇంటి నుండి మీరు ట్రిగ్గర్స్‌ను తొలగించినప్పుడు లేదా వెలుపలి ట్రిగ్గర్స్ నుండి మీ బిడ్డను దూరంగా ఉంచినప్పుడు, మీ బిడ్డ ఆరోగ్యంగా మరియు స్వల్ప ఆస్‌్ామా దాడులకే గురయ్యేటట్లు మీరు సహాయం చేయవచ్చు. మీ బిడ్డ ఆస్త్‌మా ట్రిగ్గర్స్‌ను గుర్తించడానికి మీ డాక్టర్తో పని చేయండి.
| నా బిడ్డ ఆస్త్‌మాని కొలిచేందుకు ఏదైనా మార్గం ఉందా? |
|
అవును. మీ బిడ్డకు 6 సంవత్సరాల వయస్సు నిండి ఉంటే, మీ బిడ్డ ఊపిరితిత్తుల నుండి ఊదే గాలిని కొలిచే పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) అనే ఒక సులభమైన సాధనాన్ని మీ డాక్టర్ ఉపయోగించవచ్చు. మీ రక్తపోటును బిపి సాధనం మరియు డయాబెటిక్స్ను గ్లూకోమీటర్ తెలుసుకునే విధంగా, పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) ఆస్త్‌మాకి థర్మామీటర్ వంటిది. మీ బిడ్డ పరికరం యొక్క మౌత్పీస్లో గాలి ఊదమని కోరబడతారు మరియు ఊపిరితిత్తుల సమర్థతని తెలుసుకోవడానికి రీడింగ్ తీసుకోబడుతుంది. మీ బిడ్డకు ఆస్త్‌మా ఉండి, పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) యొక్క రీడింగ్ తగ్గితే, మీ బిడ్డ యొక్క ఆస్త్‌మా తగిన స్థాయిలో నియంత్రించబడటం లేదని మరియు అతను లేదా ఆమె సమీప భవిష్యత్తులో లేదా కొన్ని రోజుల్లో దాడికి గురి కావచ్చని దాని అర్థం. ఇది మీ కంట్రోలర్ మందు మోతాదును పెంచాలని లేదా మీ బిడ్డ మందును ఎక్కువసార్లు తీసుకోవాలని సూచించే ఒక హెచ్చరిక. పీక్ ఫ్లో మీటర్ (బ్రీతోమీటర్) రీడింగ్ సాధారణంగా ఉంటే, మీ బిడ్డ ఆస్త్‌మా నియంత్రణలో ఉందని ఇది సూచిస్తుంది. ఈ సులభమైన పరీక్షను మీ బిడ్డకు ఎలాంటి నొప్పి లేదా అసౌకర్యం లేకుండా క్లినిక్లో లేదా ఇంటి వద్దే చేసుకోవచ్చు.
మీ బిడ్డ పెద్దవాడైతే లేదా యుక్తవయస్సులో ఉంటే, మీ డాక్టర్ స్పైరోమెట్రీ పరీక్ష చేయమని కూడా కోరవచ్చు.
స్పైరోమెట్రీ పరీక్ష ఆస్త్‌మా చిహ్నాలను త్వరగా కనుగొనే ఎంతో సున్నితమైన మరియు అధునాతనమైన పరీక్ష.. మీ బిడ్డ ఊపిరితిత్తులు ఎంత గాలిని ఎంతసేపు పట్టి ఉంచగలవు మరియు ఊపిరితిత్తుల్లోకి మరియు వెలుపలికి ఎంత గాలిని వదలగలవో కొలిచేందుకు స్పైరోమీటర్ ఉపయోగించబడుతుంది. మరొక విధంగా చెప్పాలంటే, మీ బిడ్డ ఊపిరితిత్తుల సమర్థత గురించి ఇది చక్కని సూచనలను ఇస్తుంది మరియు మీ బిడ్డ గాలి పీల్చడం యొక్క సమర్థత గురించి మీకు ఖచ్చితమైన వివరాలను అందిస్తుంది. మీరు మీ ECG పరీక్షను చేసుకున్నప్పుడు ఇచ్చే గ్రాఫ్ లాంటి దాన్ని, పరీక్ష నిర్వహించే ల్యాబ్ లేదా డాక్టర్ మీ రీడింగ్ను ముద్రించిన గ్రాఫ్ను అందిస్తారు.
| డాక్టర్ సూచించే మందుల వల్ల నా బిడ్డ ఆస్త్‌మా తగ్గుతుందా? |
|
ఆస్త్‌మా మందుల్లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి.
వాటిని కంట్రోలర్లు మరియు రిలీవర్లు/రెస్క్యూవర్లు అంటారు మరియు అవి వేర్వేరు విధాలుగా పనిచేస్తాయి. ఒక కంట్రోలర్ మీ బిడ్డ దగ్గడం మరియు శ్వాస తీసుకోవడంలో సమస్యలను ఏర్పరిచే ఆస్త్‌మా ట్రిగ్గర్స్‌ను, వాయునాళాలను సున్నితంగా చేయకుండా ఉంచడంలో సహాయపడుతుంది. మీ బిడ్డ ప్రతిరోజూ పళ్ళు తోముకుంటున్నాడని నిర్ధారించుకునే విధంగానే మీ బిడ్డ ప్రతిరోజూ కంట్రోలర్ తీసుకుంటున్నాడని నిర్ధారించుకోండి. దయచేసి గుర్తుంచుకోండి – కంట్రోలర్ తక్షణ ఉపశమనాన్ని ఇవ్వదు. అయినప్పటికీ, సుదీర్ఘ కాలం పాటు ఉపయోగించినప్పుడు, ఆస్త్‌మాని ఇది నియంత్రిస్తుంది మరియు రాబోయే దాడులను నిరోధించడం వల్ల రిలీవర్ మందులను తీసుకునే అవసరాన్ని తగ్గిస్తుంది.
రిలీవర్ మీ బిడ్డకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. మీ వాయు మార్గాల్లోని కండరాలను సడలిస్తుంది మరియు గాలి లోపలికి మరియు వెలుపలికి సులభంగా వెళ్లేలా, మీ బిడ్డ సులభంగా శ్వాస తీసుకునేలా వాయునాళాలను విశాలం చేయడంలో సహాయపడుతుంది. దయచేసి గుర్తుంచుకోండి – మీ బిడ్డ దగ్గుతున్నప్పుడు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులెదుర్కొంటున్నప్పుడు మాత్రమే రిలీవర్ను ఉపయోగించాలి. ఇది సాధారణంగా 4-6 గంటలు మాత్రమే పని చేస్తుంది. స్కూలుకు, క్రీడా మైదానానికి, అవును, ప్రత్యేకించి క్యాంప్లు మరియు ఇతర యాత్రలకు మీ బిడ్డ రిలీవర్ మందును తీసుకెళ్తున్నారని నిర్ధారించుకోండి.
ఏది కంట్రోలర్ మరియు ఏది రిలీవర్ మందో మీ డాక్టర్ను అడిగి తెలుసుకుని, దాన్ని ప్యాక్పై మార్క్ చేయడం ఉత్తమం.
| నా బిడ్డ ఆస్త్‌మాకి చికిత్స చేయవచ్చా? |
|
అవును, మీ బిడ్డ ఆస్త్‌మాకి ఇన్‌హలేషన్ థెరపీతో విజయవంతంగా చికిత్స చేయవచ్చు. ప్రధానంగా రెండు రకాల మందులు ఉన్నాయి. వాటిని కంట్రోలర్లు మరియు రిలీవర్లు అంటారు మరియు అవి వేర్వేరు విధాలుగా పనిచేస్తాయి.
మీ బిడ్డ ఆస్త్‌మా బారిన పడకుండా కంట్రోలర్ను ఉపయోగించవచ్చు. ఇది మీ బిడ్డ వాయునాళాలను రక్షిస్తుంది మరియు వారికి ఇబ్బంది, వాపు కలగకుండా నివారిస్తుంది. ఇది శ్వాస తీసుకోవడంలో సమస్యలను ఏర్పరిచే ఆస్త్‌మా ట్రిగ్గర్స్‌ను, వాయునాళాలను సున్నితంగా ఉంచకుండా చేయడంలో సహాయపడుతుంది. మీ బిడ్డ ప్రతి రోజూ కంట్రోలర్ మందును తీసుకోవాలి. దంత క్షయం బారిన పడకుండా మీ బిడ్డ ప్రతిరోజూ పళ్ళు తోముకునేలా, క్రిములను నివారించేందుకు భోజనం చేసే ముందు చేతులు శుభ్రం చేసుకునేలా, మీ బిడ్డ ఆస్త్‌మాని నియంత్రణలో ఉంచేందుకు కంట్రోలర్ను తీసుకోవడం కూడా ఒక మంచి అలవాటు.
ఆస్త్‌మా బారిన పడకుండా ఆపడంలో ఒక రిలీవర్ లేదా రెస్క్యూవర్ ఉపయోగించబడుతుంది. మీ బిడ్డ దగ్గు లేదా శ్వాసకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. గాలి లోపలికి, వెలుపలికి సులభంగా వెళ్లేలా వాయునాళాలు తెరుచుకోవడం ద్వారా ఈ మందు ఈ సమస్యలకు వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ఎప్పుడూ, అవును, స్కూల్లో, క్రీడా మైదానంలో, కుటుంబ విహార యాత్రలో లేదా సెలవు రోజున కూడా అవసరం ఏర్పడవచ్చు కాబట్టి, మీ బిడ్డ రిలీవర్ మందును కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. మీకు మీ బిడ్డ మందుల గురించి మీ డాక్టర్ సరిగ్గా దిశానిర్దేశం చేయగలరు.
| చిన్నపిల్లలకు టాబ్లెట్లు మరియు సిరప్లు ఉండగా ఇన్హేలర్లను ఎందుకు ఉపయోగించాలి? |
|
యుఎస్ఎ మరియు యుకె వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో, టాబ్లెట్లు మరియు సిరప్ల స్థానాన్ని ఇన్‌హేలర్లు భర్తీ చేసాయి, ఎందుకంటే ఇవి ఆస్త్‌మాని నియంత్రించేందుకు చాలా సమర్థవంతమైనవి, సురక్షితమైనవి మరియు లాభదాయకతని కూడా కలిగి ఉన్నాయి.
భారతదేశంలోని చాలా మంది రోగులు ఇప్పటికీ నోటి ద్వారా తీసుకునే మందులు (టాబ్లెట్లు మరియు సిరప్లు) సరైనవని మరియు వ్యాధిని నయం చేసేందుకు మంచినవి నమ్ముతున్నారు. అయినప్పటికీ ఆస్త్‌మాకి మందులను ఇన్హేలేషన్ ద్వారా తీసుకోవడమే ఉత్తమమైన మార్గం అని అధ్యయనాలు నిరూపించాయి. నోటి ద్వారా తీసుకునే టాబ్లెట్లు మరియు సిరప్లు అవి ముందుగా కడుపులోకి వెళ్లి, అక్కడ నుండి రక్త ప్రసరణలో చేరి ఆపై చివరగా ఊపిరితిత్తులకు చేరుకుని, పని చేయడానికి సమయం తీసుకుంటాయి. మరొకవైపు ఇన్హలేషన్ మందు నేరుగా అవసరమైన చోటుకు అంటే ఊపిరితిత్తులకు వేగంగా చేరుకుంటుంది.
మీ బిడ్డకు కంటిలో సమస్య ఉంటే కంటి మందును వేసుకున్నట్లుగా మరియు గాయం తగిలిన చోట చర్మంపై ఆయింట్‌మెంట్ రాసుకున్నట్లుగా, మీ బిడ్డ ఊపిరితిత్తులకు నేరుగా చేరుకునే సులభమార్గమే ఇన్హలేషన్.
ఇంకొకవైపు, నోటి ద్వారా తీసుకునే చికిత్సలో, మందును మీరు మిల్లీగ్రాముల మోతాదులో తీసుకోవలసి ఉంటుంది (ఇన్హలేషన్ చికిత్సతో పోలిస్తే సుమారు 40 రెట్లు ఎక్కువ) అంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇన్హలేషన్లో, మందు మైక్రోగ్రాములలో ఉంటుంది మరియు శరీరంలోని ఏదైనా ఇతర భాగానికి చాలా తక్కువ మందు మాత్రమే చేరుకుంటుంది, మీ బిడ్డకు తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయి.
| నా బిడ్డకు మందులు సురక్షితమైనవేనా? సైడ్ ఎఫెక్ట్స్ సంగతేమిటి? |
|
అవును, ఇన్హలెడ్ మందులు మీ బిడ్డకు సురక్షితమైనవి. కొంతమందిలో అన్ని మందులు సైడ్ ఎఫెక్ట్స్‌ని ఏర్పరుస్తాయి.
అయితే నేడు ఉపయోగించే ప్రధాన ఆస్త్‌మా మందులు సురక్షితమైనవని మరియు ఎటువంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఎన్నో వైజ్ఞానిక అధ్యయనాలు నిరూపించాయి. నిజానికి, గర్భం ధరించి ఉన్నప్పుడు మరియు పాలిచ్చే రోజుల్లో కూడా వాటిని సురక్షితంగా ఉపయోగించవచ్చు.
చాలా కంట్రోలర్ చికిత్సలు స్టెరాయిడ్స్ను కలిగి ఉంటాయి మరియు వాటిని ఇన్హేలర్ ద్వారా తీసుకోవడం అంటే చాలా తక్కువ మోతాదులో స్టెరాయిడ్ ఉపయోగించబడిందని అర్థం. ఇంకా, ఇన్హలెడ్ మందు నేరుగా అవసరమైన వాయు మార్గాలకు చేరుకుంటుంది కాబట్టి, మిగతా శరీరంలోకి చాలా తక్కువ మందు చేరుకుంటుంది. ఆ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి.
మీ బిడ్డ కంట్రోలర్ సాధారణంగా కోర్టికోస్టెరాయిడ్ను కలిగి ఉంటుంది, కానీ అది సురక్షితం. కోర్టికోస్టెరాయిడ్స్ అనేవి మన శరీరాల్లో సహజంగా ఉత్పత్తి అయ్యే స్టెరాయిడ్ల వంటివి. ఆ విధంగా ఇది ఆస్త్‌మాకి చాలా సురక్షితమైన మరియు సమర్థవంతమైన చికిత్సా మార్గం. చింతించకండి, కొందరు అథ్లెట్లు మరియు బాడీ బిల్డర్లు దురుద్దేశ్యంతో ఉపయోగించే స్టెరాయిడ్ల వంటివి కావు. అన్ని ఇన్హేలర్లు స్టెరాయిడ్ను కలిగి ఉండవు, కొన్ని తక్షణ ఉపశమన మందులు మాత్రమే కలిగి ఉంటాయి.
ఇన్హేలర్ను మీ బిడ్డ పళ్ళు తోముకునే ముందు ఉపయోగించమని మరియు ఉపయోగించిన తర్వాత నోటిని శుభ్రపరచుకోమని సిఫారసు చేయడమైనది. పెద్ద పరికరాన్ని ఉపయోగించడం కూడా సైడ్ ఎఫెక్ట్స్ అవకాశాలను తగ్గిస్తాయి.
| నా బిడ్డకు ఆస్త్‌మా ఉంది. మేము తల్లిదండ్రులుగా నేను ఏమి చేయగలము? |
|
మీ బిడ్డ యొక్క ట్రిగ్గర్ను తెలుసుకోవడం మరియు వాటిని నివారించేందుకు వీలైనంత వరకు ప్రయత్నించడం చాలా ముఖ్యం.
మీ బిడ్డ ఆస్త్‌మాని నియంత్రించడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
• తివాచీలు మరియు దిండ్లను దుమ్ము లేకుండా ఉంచండి.
• ప్రతి రెండు వారాలకు ఒకసారి పడకలపై దుప్పట్లను వేడి నీటితో ఉతకండి.
• ప్రతి వారం జంపకానాలను వాక్యూమ్ చేయండి లేదా నేలను ఖాళీగా వదలండి.
• గదిలోని స్టఫ్డ్ బొమ్మల సంఖ్యను తగ్గించండి మరియు వాటిని క్రమం తప్పకుండా ఉతికి, ఆరబెట్టండి.
• మీరు ప్రధానంగా నివసిస్తున్న గదుల్లో బొచ్చు మరియు ఈకలు ఉండే పెంపుడు జంతువులను దూరంగా ఉంచండి.
• డాక్టర్ సలహా ప్రకారం మీ బిడ్డ మందులు సరిగ్గా మరియు క్రమం తప్పకుండా తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి.
• ఏది కంట్రోలర్ మందు మరియు ఏది రిలీవర్ మందు అని మీకు తెలుసని నిర్ధారించుకోండి.
| నా బిడ్డకు ఆస్త్‌మా రాకుండా నేను నివారించగలనా? |
|
తల్లిదండ్రులుగా, మీరు మీ బిడ్డ ఆస్త్‌మా బారిన పడకుండా నివారించడంలో సహాయపడవచ్చు.
చాలా సందర్భాల్లో ఆస్త్‌మా వంశపారంపర్యం, కొన్నిసార్లు ఆస్త్‌మా ట్రిగ్గర్స్ ద్వారా కూడా ఏర్పడుతుంది. మీ బిడ్డకు ఏ అలర్జీలు లేదా ట్రిగ్గర్స్ వల్ల ఆస్త్‌మా లక్షణాలు ఏర్పడుతున్నాయో మీకు తెలిస్తే, రాబోయే ప్రమాదాన్ని మీరు నివారించవచ్చు. ఉదాహరణకు, ఉన్నిబొచ్చు మీ బిడ్డకు అలర్జీని కలిగిస్తే పెంపుడు జంతువులను దూరంగా ఉంచండి. డస్ట్ మైట్లు మీ బిడ్డకు అలర్జీని కలిగిస్తే మీ బిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు దుమ్ము దులపకండి. మీ బిడ్డ దుమ్ము బారిన పడకుండా స్టఫ్డ్ బొమ్మలను దూరంగా ఉంచండి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే, వాటిని క్రమం తప్పకుండా ఉతికి, ఆరబెట్టండి. మీ ఇంట్లో తేమ ప్రదేశాలు గమనించండి. ఆహార అలర్జీల కోసం గమనించండి. తివాచీలు మరియు కర్టెన్లపై పొగ ఆవరించుకునే అవకాశం ఉన్నందున ఇంట్లో ఎవరినీ పొగతాగనివ్వండి. పేరెంట్గా, మీ బిడ్డ ట్రిగ్గర్స్ పట్ల మీరు సున్నితంగా వ్యవహరించడం ముఖ్యం.
| మా బిడ్డకు ఆస్త్‌మా ఎందుకు వస్తుంది? మా మిగతా పిల్లలకు కూడా ఆస్త్‌మా వస్తుందా? |
|
ఆస్త్‌మా అనేది పిల్లల్లో చాలా సాధారణమైన దీర్ఘ వ్యాధి. చాలా మంది పిల్లల్లో, పుట్టుకతోనే ఆస్త్‌మా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాలలో ఆస్త్‌మా ఉన్నా కూడా మిగతా కుటుంబ సభ్యులకు ఇది రాదు. కేవలం ఒక్క బిడ్డకు ఆస్త్‌మా ఉన్నంత మాత్రాన, మిగతా అందరికీ వస్తుందని కాదు.
ఆస్త్‌మా సంక్రమించదు. కాబట్టి మీ బిడ్డకు ఆస్త్‌మా మరొకరి నుండి రాదు మరియు ఇల్లు లేదా స్కూల్లో మరొకరికి సంక్రమించదు.
| నా బిడ్డ ఆస్త్‌మా పెరుగుతుందా / తగ్గుతుందా? |
|
మీ బిడ్డ పెద్దవాడయ్యే కొద్దీ వారి వాయునాళాలు విస్తరిస్తాయి కాబట్టి, కొంతమందికి వారి యుక్తవయస్సు లేదా అంతకంటే ముందే కూడా ఆస్త్‌మా విపరీతంగా పెరగవచ్చు. మరికొంతమందిలో, దాడులు జరుగుతూనే ఉంటాయి లేదా కొన్ని సంవత్సరాలు ఆగిపోయి, మళ్లీ ప్రారంభమవుతాయి. కానీ మందులను ఎప్పుడు ఆపివేయవచ్చో మీ బిడ్డ యొక్క డాక్టర్ మాత్రమే నిర్ణయించగలరు. అంతకంటే ముందే మీరు మందులను మానివేస్తే, మీ బిడ్డ యొక్క ఊపిరితిత్తులకు నష్టం కలిగించే తీవ్రమైన దాడికి మీ బిడ్డ గురి కావచ్చు.
| నా బిడ్డ వ్యాయామం చేయవచ్చా? |
|
అవును, సాధారణమైన బిడ్డ చేసే పనులను మీ బిడ్డ కూడా చేయగలడు. ఆస్త్‌మా పెరుగుతుందనే ఉద్దేశ్యంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను శారీరక కార్యకలాపాల్లో మరియు క్రీడల్లో పాల్గొననివ్వరు.
కానీ అది చాలా తప్పు. మీ బిడ్డ ఆరోగ్యానికి అన్ని విధాలుగా మంచి చేసే సాధారణ క్రీడల్లో మీ బిడ్డను పాల్గొనమని మీరు ప్రోత్సహించాలి. మీ బిడ్డ క్రమం తప్పకుండా కంట్రోలర్ మందును తీసుకునేంత వరకు మీరు చింతించనవసరం లేదు. ఆస్త్‌మా ఉండే కొంతమంది పిల్లలు వ్యాయామం చేసే ముందు రిలీవర్/ రెస్క్యూ మందును తీసుకోవడం ద్వారా ఎక్కువ లాభాన్ని పొందుతారు. ప్రముఖ క్రీడాకారుల్లో ఆస్త్‌మా ఉన్నవారు ఎందరో ఉన్నారు. క్రికెటర్లు మరియు బాస్కెట్ బాల్ క్రీడాకారుల నుండి ఈతగాళ్లు మరియు ఒలింపిక్ అథ్లెట్ల వరకు. మీ బిడ్డ శారీరక కార్యకలాపాల్లో లేదా ఏదైనా క్రీడల్లో పాల్గొనే ముందు మీ డాక్టర్ను సంప్రదించండి.
| ఒత్తిడి ఉండే ఆటలు ఆడటం వల్ల నా బిడ్డ ఆస్త్‌మా పెరుగుతుందా? |
|
అవును, ఆస్త్‌మా ఉన్న బిడ్డలో ఉద్వేగం, కోపం, నిరాశ దాడిని తీవ్రతరం చేస్తాయి. కుటుంబ పరిస్థితులు కూడా మీ బిడ్డ పరిస్థితిని ఘోరంగా చేయవచ్చు. ఒక పేరెంట్గా మీకు స్పష్టమైన మరియు విశ్వసనీయమైన దృక్పథం ఉంటే, మీ బిడ్డ ఆస్త్‌మాని అదుపులో ఉంచలేకపోవడంలో అర్థమే లేదు.
| నా బిడ్డకు ప్రత్యేకమైన ఆహారం ఇవ్వాలా? |
|
మీ బిడ్డ ప్రత్యేక సంతులితాహారాన్ని తీసుకోనవసరం లేదు. ఆస్త్‌మా ఉన్న పిల్లలు చాక్లెట్లు మరియు ఐస్ క్రీమ్‌లు తినరాదని మరియు సాధారణమైన పిల్లలు చేసే పనులను చేయకూడదనే అపోహలు ఉన్నాయి. అయినప్పటికీ, గుడ్లు, విత్తనాలు, నత్త గుల్ల, కృత్రిమ రంగులు...వంటి నిర్దిష్ట ఆహారాలు మీ బిడ్డ ఆస్త్‌మాని పెంచవచ్చు, వాటిని పూర్తిగా నివారించండి. శిశువుల్లో, వ్యాధులకు వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో తల్లి పాలు సహాయం చేస్తాయి.
| నా బిడ్డ స్కూలుకు వెళ్లేటప్పుడు నేను ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? |
|
చాలా ముఖ్యంగా, మీ బిడ్డ కంగారు పడకుండా ఉండేలా మీరు చూసుకోవాలి. మీ బిడ్డకు ఆస్త్‌మా ఉన్న విషయాన్ని టీచర్ వద్ద దాచకుండా ఉండటం చాలా ముఖ్యం. ట్రిగ్గర్స్, లక్షణాలు మరియు చికిత్స గురించి టీచర్తో చర్చించండి. ప్రతిరోజూ స్కూలుకు అవసరమైన మందులను మీ బిడ్డ తీసుకెళ్తున్నారని నిర్ధారించుకోండి. ఎల్లప్పుడూ ఒక అదనపు రిలీవర్ను అందుబాటులో ఉంచుకోండి. మరియు అత్యవసర సమయాల్లో ఏమి చేయాలనే దాని గురించి వ్రాతపూర్వక సూచనలను స్కూలు టీచర్కు ఇవ్వడం మర్చిపోకండి.
| నా బిడ్డకు ఆస్త్‌మా ఉన్నప్పటికీ విహారయాత్రకు పంపవచ్చా? |
|
అవును, ఆస్త్‌మా నియంత్రణలో ఉన్నంతవరకు.
తీవ్రమైన దాడులకు మీ బిడ్డ రిలీవర్/రెస్క్యూవర్ మందులతోపాటు సూచించిన మందులను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. మీ బిడ్డ యొక్క ఆస్త్‌మా మరియు చికిత్స గురించి కూడా వెళ్ళే టీచర్కు తెలియజేయండి. ఎప్పుడూ మందులను అంటే రిలీవర్ మందును సమీపంలోనే అదనంగా ఉంచుకోమనండి. మరియు చాలా ముఖ్యంగా, కంట్రోలర్ మందును క్రమం తప్పకుండా తీసుకోమని మీ బిడ్డకు చెప్పండి.
| స్టెరాయిడ్ల వల్ల నా బిడ్డ ఎదుగుదల తగ్గుతుందా? |
|
లేదు, స్టెరాయిడ్లు మీ బిడ్డను ఎదగనివ్వకుండా అడ్డుకోవు. ఇన్హేల్డ్ కోర్టికోస్టెరాయిడ్స్ ఉపయోగించే పిల్లలు ప్రారంభంలో ఎదుగుదలలో కొంత ఆలస్యం ఉన్నప్పటికీ, ఆపై సాధారణంగా పెద్దలు ఉండే ఎత్తును చేరుకుంటారని నిరూపించబడింది. నియంత్రించని ఆస్త్‌మా పెరుగుదలలో వేగక్షీణతకు మరియు ఇతర సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. మీ బిడ్డ ఆస్త్‌మాకి సరైన మార్గంలో చికిత్స చేసేందుకు మీ బిడ్డ డాక్టర్తో చర్చించడం చాలా ముఖ్యం.
నిజానికి, నోటి ద్వారా స్టెరాయిడ్లు అంటే టాబ్లెట్లు మరియు సిరప్లు తీసుకునే బిడ్డ, లోపల ఉండే మందుల మొత్తం ఎక్కువగా ఉండి, అది శరీరం అంతటా రక్త ప్రసరణ ద్వారా ప్రసరిస్తుంది కాబట్టి ఎదుగుదలలో వేగక్షీణత ఉండవచ్చు. అయితే ఈ స్టెరాయిడ్లను ఇన్హేల్ చేసినప్పుడు, నేరుగా ఊపిరితిత్తులకు సరైన మరియు ఖచ్చితమైన మందు మొత్తం చేరుకుంటుంది. చింతించకండి, ఆస్త్‌మా ఇన్‌హేలర్లలోని స్టెరాయిడ్లు కండలు పెంచుకునేందుకు కొందరు అథ్లెట్లు ఉపయోగించేటటువంటి అనబోలిక్ స్టెరాయిడ్ల వంటివి కావు.
| నా బిడ్డ ఆస్త్‌మాని పొగతాగడం ప్రభావితం చేస్తుందా? |
|
అవును, పొగతాగడం మీ బిడ్డకు ఒక ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది మరియు మీ బిడ్డ ఆస్త్‌మాని పెంచవచ్చు లేదా ఇంకా ఎక్కువ చేయవచ్చు.
అప్రధాన పొగ ఆస్త్‌మా ఉన్న మీ బిడ్డకు ప్రమాదకరం కావచ్చు. కాబట్టి మీ కోసం మరియు మీ బిడ్డ కోసం కూడా, దయచేసి పొగతాగకండి. దయచేసి వెలుపల పొగతాగమని కుటుంబ సభ్యులకి చెప్పండి, మరొక విషయం ఏమిటంటే కార్పెట్లు, కర్టెన్లు, సోఫాలపై పొగ చాలా కాలం పరచుకుని ఉండి, బిడ్డకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
| నా బిడ్డకు ఆస్త్‌మా లేదు, అయితే క్రీడా మైదానం నుండి వచ్చిన తర్వాత దగ్గుతో అతనికి శ్వాస సరిగ్గా ఆడటం లేదు. ఇది ఆస్త్‌మా కావచ్చా? |
|
వ్యాయామ ప్రేరేపిత ఆస్త్‌మాతో మీ బిడ్డ బాధపడుతుండవచ్చు. అతను వెంటనే మీ డాక్టర్ ద్వారా పరీక్షించబడాలి.
| నా కుటుంబంలో ఎవరికీ ఆస్త్‌మా లేదు, అయినా నా బిడ్డకు వచ్చింది. ఎందుకు? |
|
ఆస్త్‌మా చాలా వరకు వంశపారంపర్యమే అయినప్పటికీ, మీ బిడ్డకు ఆస్త్‌మా వచ్చేందుకు మీ కుటుంబంలో ఒకరికి ఆస్త్‌మా ఉండి తీరాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ ట్రిగ్గర్స్ బారిన పడినా మరియు సున్నితమైన ఊపిరితిత్తులను కలిగి ఉన్నా, అతనికి ఆస్త్‌మా రావచ్చు. ఇక్కడ కొన్ని ట్రిగ్గర్స్ ఉన్నాయి: డస్ట్ మైట్లు, పెంపుడు జంతువులు, పూల పుప్పొడి, వ్యాయామం, సిగరెట్ పొగ, కాలుష్యం, ఒత్తిడి.
| నా బిడ్డకు ఉన్నది ఆస్త్‌మా అని, మరే ఇతర వ్యాధి కాదని నాకు ఎలా తెలుస్తుంది? |
|
చాలా వరకు రాత్రి వేళల్లో లేదా తెల్లవారు ఝామున లేదా ఆడుకునేటప్పుడు లేదా నవ్వినప్పుడు లేదా ఏడ్చినప్పుడు ఛాతిలో పట్టినట్లు ఉండటం, శ్వాస తీసుకోలేకపోవడం, దగ్గు మరియు ఆయాసం వంటి లక్షణాలు మీ బిడ్డకు ఉండి, మీ కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఆస్త్‌మా ఉంటే, మీ బిడ్డ చాలా వరకు ఆస్త్‌మాతో బాధపడుతుండవచ్చు.
చాలా తరచుగా, దగ్గుకు కేవలం దగ్గు చికిత్సే చేయబడుతుంది, అయితే పునరావృత దగ్గుకు అంతర్లీనంగా ఆస్త్‌మా కారణం కావచ్చు. ఒక పేరెంట్గా, మీ బిడ్డ యొక్క పట్టువిడువని దగ్గు మరియు శ్వాస ఆడకపోవడాన్ని మరియు దాన్ని ప్రారంభించే ట్రిగ్గర్స్‌ను గమనిస్తూ ఉండండి. మీ డాక్టర్ సలహాను పాటించండి.
| నాకు ఆస్త్‌మా ఉంటే నా బిడ్డకు పాలివ్వచ్చా? |
|
అవును, మీరు ఇవ్వవచ్చు. మీకు ఆస్త్‌మా ఉన్నప్పటికీ మీరు మీ బిడ్డకు పాలివ్వచ్చు.
ఎందుకంటే ఆస్త్‌మా ప్రసారం అయ్యే వ్యాధి కాదు. పాలివ్వడం ద్వారా ఇది ప్రసారం కాదు. కాబట్టి అది బిడ్డపై ప్రభావం చూపదు.
ఇంకా, ఇన్హేల్ చేసిన మందు చాలా సురక్షితం కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఉపయోగించవచ్చు.
చనుబాలులో రక్షిత కారకాలు ఉంటాయి కాబట్టి ఆస్త్‌మా పెరిగే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రపంచంలోని గర్భిణి స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు ఇన్హలెడ్ మందును సురక్షితంగా ఉపయోగిస్తున్నారు.
| నా బిడ్డకు ఆస్త్‌మా ఉంటే నా ఇంట్లో పెంపుడు జంతువులను ఉంచుకోరాదా? |
|
పెంపుడు జంతువులు వద్దు. జంతువుల ఉన్ని మరియు ట్రిగ్గర్స్ ఆస్త్‌మాకి సాధారణ ప్రమాద కారకాలు, పెంపుడు జంతువులను పెంచుకోవద్దని సూచించడమైనది లేదా నివసిస్తున్న ప్రదేశాలు లేదా పడకగదుల్లోకి వాటిని అనుమతించవద్దు. మీరు దీన్ని మీ బిడ్డకు వివరించి చెప్పి, వాటికి బదులుగా మీ బిడ్డను చేపను పెంపుడు జంతువుగా పెంచుకోమనండి.
| నా బిడ్డకు ఆస్త్‌మా వచ్చినప్పుడు నేనేమి చేయాలి? |
|
మీ బిడ్డ కంట్రోలర్ మందును క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండి, ట్రిగ్గర్స్‌ను నివారిస్తే, ఆస్త్‌మా దాడి చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ, ఆస్త్‌మా దాడి చేస్తే, మీ బిడ్డను:
• వెల్లకిలా పడుకోబెట్టండి – బోర్లా పడుకోబెట్టవద్దు. ప్రశాంతంగా, నిశ్చింతగా ఉండేందుకు ప్రయత్నించండి. బిగుతుగా ఉన్న బిడ్డ దుస్తులను వదులు చేయండి.
• ఆలస్యం చేయకుండా, మీ డాక్టర్ సూచించిన మోతాదులో రిలీవర్ మందును ఇవ్వండి
• తర్వాత కనీసం 5 నిమిషాలు ఆగండి. ఎలాంటి మెరుగుదల కనిపించనట్లయితే, మీ డాక్టర్ సలహా ఇచ్చినట్లు రిలీవర్ మందును అదనపు మోతాదులో ఇవ్వండి.
•అప్పటికీ మీ బిడ్డ స్థితి మెరుగ్గా కాకపోతే, వెంటనే మీ డాక్టర్ని పిలవండి. డాక్టర్ని సంప్రదించకుండా రిలీవర్ మందు మోతాదును మాత్రం ఎక్కువ పెంచకండి.
| నేను ఎదురుచూడవలసిన అత్యవసర హెచ్చరిక చిహ్నాలు ఏమిటి? |
|
మీ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లి, వెంటనే అర్జెంట్ కేర్ను అందించాల్సిన సందర్భాలు ఉంటాయి. అతను లేదా ఆమె ఈ క్రింది పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి బిడ్డకు అత్యావశ్యక వైద్యం అవసరం అని తెలుసుకుంటారు:
• అసాధారణ రీతిలో శ్వాసిస్తుంటే: వేగంగా, లేదా నెమ్మదిగా లేదా సాధారణం కంటే నిస్సారంగా.
• దగ్గు లేదా ఆయాసం మొదలై ఆగకుంటే.
• వేళ్ళ గోళ్ళు లేదా పెదవులు నీలంగా మారినప్పుడు.
మీ బిడ్డకు ఆస్త్‌మాతో అత్యావశ్యక వైద్యం అవసరమని మీరు తెలుసుకునేందుకు మీరు ఎలాంటి అత్యవసర హెచ్చరిక చిహ్నాల కోసం చూడాలో మీ బిడ్డ డాక్టర్ను అడగండి. మీరు ప్రశాంతంగా ఉండేందుకు ఇది ముఖ్యం.
| నా బిడ్డ ఇల్లు మరియు స్కూల్లో సాధారణ జీవితాన్ని గడపగలడా? |
|
అవును! మీ డాక్టర్ సలహాతో, సరైన చికిత్సతో, మీ ప్రేమాభిమానాలు మరియు సంరక్షణతో, మీ బిడ్డకు మీరు అన్నివిధాలా సాధారణ జీవితాన్ని అందించవచ్చు.
• దగ్గు, ఊపిరి ఆగినట్లు ఉండటం పూర్తిగా అదుపులో ఉండాలి
• స్కూలు లేదా పాఠాల్ని ఆపే అవసరం లేదు.
• మీ బిడ్డ సంరక్షణ కోసం మీరు ఉద్యోగం మానివేయనక్కరలేదు.
• ఆడుకోవచ్చు మరియు వ్యాయామం చేయవచ్చు
• అంతరాయం లేని నిద్ర
• హాస్పిటల్‌కు ఖరీదైన మరియు బాధాకరమైన సందర్శనలు ఉండవు
• సాధారణమైన ఎదుగుదల మరియు అభివృద్ధి
ప్రస్తుతానికి ఆస్త్‌మాని నయం చేయలేము. అయినప్పటికీ, చాలా మంది పిల్లలకి, సరైన నిర్వహణ మరియు చికిత్సతో ఆస్త్‌మాని నియంత్రణలో ఉంచవచ్చు. ఆస్త్‌మా దీర్ఘ (సుదీర్ఘ కాలం) వ్యాధి కాబట్టి, సరైన మందులతో మీ బిడ్డ సాధారణమైన, ఆరోగ్యమైన, చురుకైన జీవితాన్ని గడపవచ్చు.
| ఆస్త్‌మా కారణంగా పిల్లలు చనిపోగలరా? |
|
దురదృష్టవశాత్తూ, అవును, ఆస్త్‌మా వల్ల మరణం సంభవించవచ్చు. WHO అప్డేట్ ప్రకారం, ఆస్త్‌మా మూలంగా ప్రపంచవ్యాప్తంగా మరణించే వారి సంఖ్య సుమారు 2,50,000.
ఆస్త్‌మాని ముందే గుర్తించకపోయినా లేదా దాడికి గురైనప్పుడు రోగి సమీపంలో రిలీవర్ లేకపోయినా మరణం సంభవించవచ్చు. మరణ ప్రమాదంలో ఉన్న బిడ్డను గుర్తించడంలో ఉన్న ఉత్తమ మార్గాల్లో ఒకటేమిటంటే, బ్రాంకోడిలేటర్ ఇన్‌హేలర్‌ను (రోజుకు పది పఫ్ల కంటే ఎక్కువగా, లేదా నెలకు ఒకటి లేదా మరిన్ని ఇన్‌హేలర్లు అవసరమయ్యేవాళ్లు) ఎక్కువగా తీసుకునేవారు, ఎందుకంటే ఇది ఆస్త్‌మా వారి నియంత్రణలో లేదని సూచిస్తుంది. తరచుగా నెబ్యులైజేషన్స్ కోసం ఆస్పత్రికి వెళ్లే ఏ బిడ్డ అయినా ప్రమాదంలో ఉన్నట్లే.
ఆస్త్‌మా మూలంగా సంభవించే చాలా మరణాలను నివారించవచ్చు. కాబట్టి దయచేసి మీ బిడ్డ యొక్క ఆస్త్‌మా నిర్వహణపై శ్రద్ధ వహించండి.